పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

భారత దేశమున


ముగా ప్రయాణము చేయగలుగుదురు. ఏజిల్లాలోనైన నొక ధనపుమూట నెవరైనపారవేసికొనినచో నది చూచినవారు దానిని ఒక కొమ్మకు కట్టి రక్షకభటులకు తెలుపు నీతి మర్యాదచ్చట కల"దని హాల్ వెల్ వాసి యున్నాడు.

(Tracts upon India. Reform Pamphlet No. 9)

“డక్కాలో సాగుచేయని భూమిలేదు. న్యాయము చక్కగా పరిపాలింపబడుచుండెను. జస్వంతరావు పరిపాలన నిర్దుష్టముగానుండెను. అతడు విద్యావంతుడు. ప్రజానురంజకుడు. సర్వమక్తావ్యాపారపంటలపైన నతడుపన్నులుతీసి వేసెను.” అనివ్రాసియున్నాడు, అలివర్దీఖాను వంగరాష్ట్ర నవాబగునప్పటికి వంగరాష్ట్ర మట్టి మంచిస్థితిలో నుండెను. అతని పరిపాలనలో 'దేశ మభివృద్ధి గాంచెను. సత్ప్రవర్తనము, సమర్థతయు నతనికి గావలసిన యోగ్యతలు.మహమ్మదీయు లైనను హిందువులైనను అతడు సమానముగ జూచి మంత్రి పదవులకు సైనికోద్యోగములకు నియమించుచుండెను. దేశాదాయము దూరపు ఢిల్లీకి పంపివేయుటగాక దేశక్షేమముకొరకు ఖర్చు చేయబడుచుండెను. (హిస్టరీ ఆఫ్ బెంగాల్ , స్టివార్డు) వంగరాష్ట్రము ఆంగ్లేయ పరిపాలనక్రిందికి వచ్చిన పదేండ్లలోపుగా దేశములో గొప్పమార్పు వచ్చినది. రాష్ట్రమున దుష్పరిపాలనము ప్రజాపీడనమును మితిమీరినవి. " దేశపరిస్థితులు తెలియక దూరములనుండి కేవలము ధనకాంక్షతో నుండు కంపెనీ డైరెక్టర్లకు తప్ప నీ దేశములో తాము చేయు పనుల కిక నెవ్యరికిని బాధ్యత వహింపనక్కరలేని పద్దతిలో అమితమైన లంచగొం