బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
37
డెలై అధిక గౌరవముగల కంపెనీ యుద్యోగులు, మానవమాత్రుడు గ్రహించుకొనలేని వ్యామోహములకు ఆశలకు విశేషావకాశములు కలిగి యుండుట, యేదైన నొక కబు రింగ్లాండుకు పోయి వచ్చుటకు 1 1/2 సంవత్సరములు పట్టుపరిస్థితిలో క్లైవు ఇంగ్లాండుకు వెళ్ళినపిదప 5 సంవత్సరములుజరిగిన దుష్టపరిపాలన వర్ణనాతీతము. క్రీస్తుకుపూర్వకాలమున రోము సామ్రాజ్యములో గవర్నరులుగా పంపబడిన “ప్రోకాన్సలు"లు చంద్రకాంత శిలాహర్మ్యములు నిర్మించుకొనుటకు సంపదలతో తులతూగుటకు అత్తరులో పొరలుటకు ఇంద్రభోగము లనుభవించుటకు తమక్రిందనుండిన పరగణాల భాగ్యభోగ్యములనెల్ల పిండిపీల్చి పిప్పిచేయుచుండి నట్లే క్రీస్తు తరువాత మనదేశము నాక్రమించిన ఆంగ్లేయవర్తక కంపెనీ నౌకరులు మనదేశ భాగ్యభోగ్యము లనుభవింపసొగిరి. దేశములోని వర్తకమును తమహస్తగతమును జేసికొనిరి. దేశవస్తువులను తమకు చౌకగా సమ్మునట్లు తమవస్తువులను ప్రియముగా గొనునట్లు నేటివులను బాధించుచుండిరి. దేశములోని న్యాయవిచారణాధికారులను, పోలీసులను, రివిన్యూ అధికారులను, ఈ తెల్లనౌకరులు తృణీకరించి అవమానించు చుండిరి. బ్రిటిషు ఫ్యాక్టరీయొక్క ప్రతినౌకరుకును కంపెనీవారికి గల సర్వాధికారములు నుండెను. ఇట్లు కలకత్తాలోని తెల్లవారందరు అతి స్వల్పకాలములోనే లెక్క లేనంత ధనము నార్జించుకొనిరి. మూడుకోట్ల భారతీయుల భాగ్యభోగ్యము లెల్ల ఇట్లు హరింపబడి వారు ధనికులైరి. వీరు దరిద్రులైరి.