పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

35


టిప్పూలే చేసినది కాదు. ఈ యౌన్నత్య కారణములు, మైసూరులోని చక్కనికాలువలు, అంతకుముందు పాలించిన హిందూరాజుల కాలముననే నిర్మింపబడెను.

1789లో ఆంగ్లేయులకు మైసూరుతో మూడవయుద్ధము తటస్థించెను. 1792 లో టిప్పుసుల్తాను తనరాజ్యములో సగము ఆంగ్లేయులకిచ్చి విశేష నష్టపరిహారము నొసగవలసి వచ్చెను. హైదరు రాజవంశమునకు మిగిలిన రాజ్యమును వెలస్లీ పూర్తిగా బ్రిటిషు రాజ్యములో కలుపుకొని ఆవంశమును రూపుమాపి. ప్రాతహిందూరాజ కుటుంబములోని వారిలో మిగిలియున్న వారికి కొద్ది రాజ్యభాగ మిచ్చి మైసూరు రాజుగా జేసెను.

IV

వంగ రాష్ట్రము

హైదరాలీ మైసూరు నాక్రమించిన సంవత్సరముననే వంగరాష్ట్రము బ్రిటీషువారి స్వాధీనమైనది. వంగరాష్ట్రము మొగలు చక్రవర్తిమకుటములోని విలువలేని భూషణము. బ్రిటిషువారివశమైన యీ క్రొత్తరాజ్యము తరుగనిసంపదలు కల దేశమని ఈ రాజ్యము తన యజమానులను ప్రపంచములో కెల్ల ధనవంతమగు సంఘముగజేసి తీరునని క్లైవు అప్పుడే చెప్పియుండెను. వంగరాష్ట్రము నందనవనమని పేరువడసియుండెను. "ఈరాజ్యములో ప్రజలకు ఆస్తికి నెట్టిభయమును లేదు. విలువగల సరుకులతో పోవువర్తకులు సైతము ప్రభుత్వమువా రుచితముగా నిచ్చు రక్షకభటుల సంరక్షణకలిగి నిర్భయ