పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/599

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

109

1793 చట్టము పెద్దరాష్ట్రములకే వర్తింపబడెను గాని చిన్న పరగణాలకు వర్తింపబడనందునను పెద్దరాష్ట్రములలో గూడ కొన్ని సందర్భములలో ఈ సివిలుసర్వీసు ఉద్యోగులు గాక ఇతరులుకూడ సివిలు ఉద్యోగులుగూడ నియమింపబడ వలసివచ్చినందునను అట్టి ఉద్యోగవర్గమునకు హక్కు బాధ్యతలు చట్టమునుబట్టి అంతవరకు విధింపబడి యుండనందునను 1861 లో ఇండియ౯ సివిల్‌సర్వీసెన్ ఆక్టు అనబడు నొక చట్టము చేయబడి కవనెంటెడు సిపిలుసర్వీసువారికి ప్రత్యేక హక్కుగా నుంచబడిన ఉద్యోగముల జాపితాను నిర్ణయించి ఇతర ఉద్యోగుల నియామకమును శాస్త్రసమ్మతము చేసెను.

మద్రాసులో నీకవనెంటెడ్ సివిలుసర్విసువారి కీదిగువ ఉద్యోగములు ప్రత్యేకింపబడి యున్నవి :--

2 కౌన్సిల్ మెంబర్లు, 2 హైకోర్టు జడ్జీలు; 2 జిల్లా జడ్జీలు; 21 మంది బోర్డుఆఫ్ రెవిన్యూసభ్యులు; 3 గవర్నమెంటు సెక్రటరీలు; 21 కలెక్టరులు; 19 మంది రివిన్యూబోర్డు సెక్రటరీలు 1 మద్రాసు కష్టమ్సుకలెక్టరు; సబ్ కలెక్టరులు, ప్రిన్సిపాల్సు, అసిస్టెంటులుకలసి 17 మంది; గవర్నమెంటు అండరు సెక్రటరీలు ఇద్దరు; హెడ్డుఅసిస్టెంటులు, సీనియరు అసిస్టెంటులు కలసి 19మంది; ఒక స్పెషలు అసిస్టెంటు. ఈ ఉద్యోగములు లా ప్రకారము ప్రత్యేకింపబడినవి. వీరిలో 30 మంది. నెల 1కి రు 2500 లు మొదలు 6500 వరకు జీతములున్న వారు. మిగతా వారికి 600 మొదలు 2500 వరకు జీతములుండును. 1855 కు పూర్వము ఈ ఉద్యోగములు కేవలము కంపెనీ డైరెక్టర్ల