108
భారతదేశమున
డిన సన్నదు పట్టము ప్రకారము భారతదేశములోని కవున్సిలు మెంబరుకన్న తక్కువ హోదాగలఉద్యోగము లీసివిలు సర్వీసుకు ప్రత్యేక హక్కుగా పార్లిమెంటువారివలన చేయబడినవి. నాటినుండియే దీనికి కవనెంటెడు సివిలు సర్వీసు అనిపేరువచ్చినది. ఈ తరగతిలో చేరనివారికి అ౯కవనెంటెడ్ సివిలు సర్విసు అని పేరువచ్చినది. ఈ ఉద్యోగులను రెండు సంవత్సరములు తరిబీదు చేయుటకు ప్రత్యేక కాలేజీ 1805 లో ఇంగ్లండులో ఏర్పాటు చేయబడెను, ఈ ఉద్యోగములు కేవలము డైరెక్టర్ల ఆశ్రయింపుపైన ప్రాపకముపైన 1853 వరకు ఆధారపడియుండెను. ఆ సంవత్సరములో వీనిని పోటీ పరీక్షలలో తేరినివారికిచ్చు పద్దతి నిర్ణయింపబడెను. మొదటిపరిక్ష 1855 లో జరిగెను. డైరక్టర్లు ఏర్పరచిన కాలేజీ 1858 లో మూయబడెను. వీరుఉద్యోగములో చేరవలసినవయస్సు 22, 23 గా నిర్ణయింపబడి ఒకసంవత్సరము ఇంగ్లండులో నొక విశ్వవిద్యాలయమున తరిబీదు పొందునట్లు ఏర్పాటు చేయబడెను. ఇది తరువాత 19 కి తగ్గింపబడెను.
ఈ సివిలియ౯ ఉద్యోగులు యువకులుగా క్రొత్తగా ఈ దేశమునకువచ్చి ఈ దేశధర్మములు భాషలు, రివిన్యూ వ్యవహారము, నేర్చుకొనగలందులకు మొదటజిల్లా ముఖ్యపట్టణములో చిన్న మేజస్ట్రీటుగా నియమింపబడి అవి నేర్చుకొని , చిన్న పరీక్షలిచ్చిన తరువాత పెద్దహోదాకు మొదటితరగతి మేజస్ట్రీటుగాను ఇంక పై అధికారములకును అర్హుడగును.