110
భారతదేశమున
అధీనముననుండెను. ఆ సంవత్సరమున పోటీపరీక్షలు నెలకొల్పబడెనని చెప్పియుంటిమి. 1890 లో పార్లమెంటు శాసనము క్రింద కొన్నినిబంధనలప్రకారము ఇండియా గవర్నమెంటువారికి ఇష్టమున్నచో ఏయుద్యోగమునకై నను భారతీయులను నియమింపవచ్చునని శాసింపబడినదిగాని ఈనిబంధనలు అమలులోనికి 9 సంవత్సరములకుగాని రాలేదు. అప్పుడుగూడ ఈ అధికారమునుబట్టి నియమింపబడిన భారతీయులసంఖ్య అతిస్వల్పము. 1886-87 లో నొకపబ్లికు సర్వీసుకమిషను చేసిన సూచనల ప్రకారము ఇంగ్లాండులో నియమింపబడు ఐ. సి. ఎస్. ఉద్యోగులు రాష్ట్రీయ సివిలుసర్వీసు, (తాబేదారి) సబార్డినేట్ సర్వీస్ అనబడుతరగతులుగ చేయబడెను. ఎట్టిశాసనము నిబంధనము లేకపోయిననూ ఆచారమునుబట్టి ఈక్రింది యుద్యోగములు కేవలము ఇంగ్లాండులో నియమింపబడిన ఐ. సి. ఎస్. వారికిమాత్రమేహక్కుకలిగియున్నవి. తిరువాంకూరు రెసిడెంటు; హైకోర్టు రిజిష్ట్రారు; నీలగిరికమీషనరు; రివిన్యూ సెటిల్మెంటు డైరక్టరు; రివిన్యూ సెటిల్మెంటు డిప్యూటీకలెక్టరులలో కొన్ని జిల్లా స్మాల్ కాజుకోర్టు జడ్జీపదవులుకూడా ఐ. సి. యస్. వారే పొంది యుండిరి.
క్రొత్తగావచ్చిన జూనియరు సివిలియనులు ముందుగా పనినేర్చుకొనుటకు జిల్లా ముఖ్యపట్టణమున అసిస్టెంట్లుగానుండి పైనచెప్పబడిన ఉద్యోగములలో నాల్గుసంవత్సరములలో , ప్రవేశింపగల్గుదురు. సెలవుమీదనున్నవారు పోగా ఇట్టివి నూరు ఉద్యోములుండును. దామాషాగా సాలుకు 7 మంది