పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/593

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

103


వైద్యము మొదలగు శాఖలపైన తనిఖీకొరకు కొందఱు ఉద్యోగులనుకూడా కేంద్రప్రభుత్వము నియమించును. రాష్ట్రీయ ప్రభుత్వముల ఆదాయవ్యయ ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వమునకు పంపబడగా వానిని అవసరమైనచో సవరణ చేయును. రాష్ట్రీయ ప్రభుత్వము నియమించు ఉద్యోగి వర్గములు అదనపుసంఖ్య ఉద్యోగుల నియామకముకు కేంద్ర ప్రభుత్వము వారు అనుమతించవలెను. అందువలన కేంద్రప్రభుత్వము అంగీకరింపనిది రాష్ట్రీయ ప్రభుత్వములు పరిపాలనకు సంబంధించిన ఏక్రొత్తకార్యము చేయవీలులేదు. రాష్ట్రీయ ప్రభుత్వములోని ఉద్యోగులకు ఇతర ప్రజలకు ఆ ప్రభుత్వముల ఉత్తర్వులపైన కేంద్ర ప్రభుత్వమునకు అప్పీలుచేసికొను అధికార మివ్వబడినది. మద్రాసు బొంబాయి రాష్ట్రములుగాక తక్కిన రాష్ట్రములందు ముఖ్యమైన ప్రభుత్వోద్యోగుల నియామకమునందెల్ల కేంద్రప్రభుత్వము వారి అనుమతి పొందవలెనను నిబంధన మేర్పరుపబడినది. పెద్దరాష్ట్రములకు వేరు వేరు ఆదాయవ్యయపట్టిక లుండును. రాష్ట్రములో వసూలు చేసిన ఆదాయములో భాగమును పొందును. వీనిలో ముఖ్యముగా భూమిసిస్తు, సెస్సులు, ఎక్సైజు, స్టాంపులు అడవులు, ఆదాయపుపన్ను రాష్ట్రముల కొసగబడినవి. మొదటి రోజులలో ఇంతకాలము ఇట్లు వసూలుచేసికొని ఉపయోగించుకోవచ్చునని కొంతకాలపరిమితివరకు నిర్ణయింపబడుచుండెను. 1906 తరువాత నిదిస్థిరముగా నిర్ణయింపబడెను. ముఖ్యమైన రాష్ట్రములకు శాసన సభలుండెను. కాని కేవలము రాష్ట్రీయ వ్యవహా