104
భారతదేశమున
రములను గూర్చి మాత్రమే శాసించుటకు వీలుండెను. ఆ శాసన సభ( లెజిస్లేటివు కౌన్సిలు)లు చేయు శాసనములన్నియు గవర్నరుజనరలుఆమోదము పొందవలెను. ముఖ్యమైన స్వదేశసంస్థానము లన్నిటి పైన గవర్నరు జనరలే అధికారము కలిగియుండును. తిరువాంకూరు, కొల్హాపూరు, పాటియాల సంస్థానములపైన మాత్రము ఆయా రాష్ట్రీయ ప్రభుత్వముల కధికార మీయబడెను. ఇది చారిత్రక పరిణామము.
గవర్నరుజనరలు కార్యాలోచన సభలో పూర్వము సామాన్యసభ్యులు నలుగు రేయుండిరి. 1861 లో 5వ సభ్యుని నియమించుట యవసరమని అట్లుచేసిరి. 1874 లో పబ్లికు వర్క్సుకు అవసరమైనచో 6వ సభ్యుని జేర్చుకొనవచ్చునని శాసించిరి. సర్వసేనాని ఎప్పుడును అసాధారణ సభ్యుడుగా నుండును. ఈకార్యాలోచన సభలో మెజారిటీ అభిప్రాయ ప్రకారమే వ్యవహారములు తీర్మానింపబడును; గాని గవర్నరు జనరలు అత్యావసర సమయములందు భిన్నముగా వర్తింపవచ్చును. ఈసభకు గవర్నరుజనరలే అధ్యక్షత వహించును. అతడు హాజరులేనిచో సీనియర్ సభ్యుడు అట్లుచేయును. ఈ కార్యాలోచనసభ పూర్వము అన్ని వ్యవహారములు కలిసి ఆలోచించుచుండెను. లా మెంబరు, ఫైనాన్సు మెంబర్లు మాత్రం వేరుగానుండిరి. అయితే క్యానింగు హయాములో 1858 లో వ్యవహార బాహుళ్యము వలన ఒక్కొక సభ్యుని కొక్కొకశాఖ విభజించి యివ్వబడెను. చాలాముఖ్యమైన వ్యవహారములు మాత్రము గవర్నరుజనరలో లేక అందరుకలిసిన సభయో