102
భారతదేశమున
ఆంగ్లరాణి లేక రాజు యొక్క ఫర్మానాక్రింద నితడు నియమింపబడి 5 సంవత్సరములు పరిపాలించును. ఇతనికి ఖర్చులు గాక సాలుకు 2 లక్షల 50 వేల రూపాయిలు జీతము. దేశపరిపాలనకంతకు నితడు బాధ్యుడైయుండును. స్వదేశసంస్థానముల వ్యవహారములపైనగూడా అదుపుఆజ్ఞలు కలిగియుండును. సాక్షాత్తుగా ప్రభుత్వము చలాయించుటలో నీప్రభుత్వాధికారములు కేంద్రరాష్ట్రీయప్రభుత్వముల మధ్యవిభజింపబడినవి. కార్యాలోచన సభాయుతుడగు గవర్నరుజనరలు కే 'ఇండియా(ప్రభుత్వము)గవర్నమెంటు' అనిపేరు. ఈ కేంద్రఇండియా గవర్నమెంటువారికే విదేశవ్యవహారములు, దేశరక్షణము, పన్నులవిధింపు, చెలామణి, ఋణము, నిరకునామా (టారిఫ్) లు తపాలా, తంతి, రైళ్లు, పైన అధికారమునుంచుకొని తక్కిన అంతరంగిక పరిపాలన పన్నులు (రివిన్యూ) దేశాదాయము వసూలు, విద్య, వైద్యము, ఆరోగ్యము, పల్లంసాగునీటిపారుదల, బిల్డింగులు, రోడ్లు రాష్ట్రీయ ప్రభుత్వములకు వదలబడినవి. అయినను ఈ రాష్ట్రీయపరిపాలనలపైన కేందప్రభుత్వము పెత్తనము చేయుచుండును. సామాన్యపరిపాలనా విధానము నెల్ల ఈకేంద్రప్రభుత్వమే నిర్ణయించి అవి సరిగా జరుగు చున్నవో లేవో యని ప్రభుత్వనివేదికలనుబట్టి తనిఖీచేయుచుండును.
తాను వ్యవహరించు రైళ్లు, తపాల, తంతి మొదులగు ప్రభుత్వశాఖల ముఖ్యాధికారులనుగాక రాష్ట్రీయప్రభుత్వములకు వదలిన వ్యవసాయము, సాగు, అడవులు, విద్య,