ఈ పుట ఆమోదించబడ్డది
బ్రిటీష్‌రాజ్యతంత్రము
101
రాజును తొలగించి కొమారుని నిల్పిరి. రాజకీయకారణముల వల్ల నాభారాజును, దేవాస్ రాజును, ఆల్వారురాజును పదచ్యుతులుగ జేసిరి. బొమ్మమారినప్పుడెల్ల బ్రిటీషువారి సర్వాధికారమును పలుకుబడియు హెచ్చుచుండును.
III
కేంద్రపరిపాలన : ఇండియా గవర్నమెంటు
1858 మొదలు క్రొత్తరాజ్యాంగమున భారతదేశ ఆంతరంగికపరిపాలనమున హెచ్చుమార్పులు జరుగలేదు. దేశపాలనమునకు పూర్యమువలెనే గవర్నరుజనరలే అధిపతి. శాసనధర్మములందు వైస్రాయియనుపేరు లేదుగాని సామాన్యముగా అతడాపేరుతోనే వ్యవహరింప బడసాగెను.