86
భారతదేశమున
ఈ అంకెలవిషయములో గమనింపవలసిన ముఖ్యవిషయములు.
1. ధరలతేడాలు: 1913 - 14 లో 45 రూపాయల ఆదాయము 1921 - 22 లో 81 రూపాయలతో సమానము.
2. షా ఖంబటాగార్లు బ్రిటీషురాజ్యము సంస్థానములుకలిపి అంచనావేసిరి. బ్రిటీషురాజ్యము కొంచె మధికభాగ్యవంతము గనుక తక్కిన అంచనాల దామాషా తగ్గును.
3. ఫిండ్లేషిర్రాన్‌గారి అంచనాలో వేలకువేలు సంపాదించు వృత్తివంతులు ఉద్యోగుల ఆదాయము చేరినది.
4. వివిధదేశముల ఆదాయములతో నిది పోల్చిచూచునప్పుడు ఆయాదేశీయుల ఆహారవ్యవహారములుకూడ గమనింపవలసియుండును. అందరికి నొకే జీవనాధారపద్దతు లుండవు.
5. ఇటీవల 1931 లో బ్యాంకింగు విచారణ సంఘమువారు భారతదేశములోని కర్షకుల దామాషా ఆదాయము ఎంత హెచ్చు మదింపువేసినను సాలుకు తల 1కి 42 - 0 - 0 రూపాయలకన్న లేదని నిర్లయించినారు. అందువలన మన దేశములో తల 1 కి దామాషా ఆదాయము రోజు 1 కి రు 0 - 1 - 7 లు.
వినిధ దేశములలో సాలుకు మనుష్యునికి వచ్చు దామాషా ఆదాయము కొన్ని అంచనాలు (రూపాయలు)
దేశము | 1900 | సంగ్రామ పూర్వము | 1914 | 1919 | 1924 |
అమెరికా | 585 | 750 | 1080 | 1850 | 3328 |
బ్రిటీషుదీవులు | - | 600 | 750 | 1250 | 1456 |