Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

33

1778 లో బ్రిటిషువారు ఫ్రెంచివారితో యుద్ధముచేయుచు పాండుచేరీనిపట్టుకొని మైసూరులోచేరిన 'మాహి'ని ముట్టడించిరి. హైదరాలీ తన అసమ్మతిని చూపినను వినలేదు. అంతట నతడు కర్నాటకములోని ఆంగ్లప్రదేశములపై దండెత్తి వచ్చెను. ఈతని రాకకు ఆప్రదేశజనులు తమ్ముద్దరించుటకువచ్చినట్లు సంతసించిరని ఆంగ్లచరిత్రకారుడగు మిల్లు వ్రాసియున్నాడు. అనగా నాప్రజ లానాటి యాంగ్లపరిపాలనలో నంత బాధపడుచుండిరన్న మాట!

ఆ యుద్ధములో సేనానాయకుడుగనుండిన యొక ఆంగ్లేయుడుకూడ హైదరు ప్రజానురంజకుడుగ నుండెనని వ్రాసినాడు. హైదరు పేటా ఆర్కాటులను స్వాధీనపరుచుకొనెను. అతడు అచ్చటి ప్రజల కెవ్వరివలన నెట్టి బాధయు కలుగనీయ లేదు. ఎట్టిదోపిడియు అశాంతియులేకుండ కాపాడెను. నవాబు క్రిందనుండిన యుద్యోగులనెల్ల ఆ యుద్యోగములందే యుండనిచ్చెను. ఆంగ్లేయోద్యోగులకు కావలసిన సొమ్ముగూడ హైద రిచ్చెనని టారెన్సు తన గ్రంథమున వ్రాసినాడు. తరువాత నాంగ్లేయులు మైసూరుపై దండయాత్ర వెడలినప్పుడు జరిగించిన అత్యాచారములకు భీభత్సములకు నిది యెంతభిన్నము! అయిన నాంగ్ల చరిత్రకారులు హైదరు నొక్క రాక్షసునిగ జిత్రించిరి. ఆంగ్లేయులతోడి యుద్ధమధ్యముననే 1782 లో హైదరు మరణించెను. టిప్పుసుల్తాను మైసూరు రాజయ్యెను. ఆంగ్లేయు లతనితో నొక సంధి జేసికొనిరి.

హైదరు తన జీవిత కాలములో చాలవరకు యుద్ధము