పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

భారత దేశమున


లందు నిమగ్నుడై యున్నను, అతడు రాజ్యపరిపాలనము నేమరలేదు. అతని పరిపాలనలో, పారిశ్రామికులు వర్తకులు అభివృద్ధిగాంచిరి. కృషి, వర్థిల్లెను. ఉద్యోగులందు లంచగొండెతసము అణచి వేయబడెను. తన రాజ్యములో నలుమూలలను విదేశ రాజ్యవ్యవహారములనుగూడ హైదరు జాగ్రత్తగాకనిపెట్టి చూచుచునేయుండెను. అతనికి చదువు రాకపోయినను మంచి తెలివి తేటలతో తన ఉత్తర్వులను తన కార్యదర్శులకు చెప్పి వ్రాయించును. అతడు చనిపోవు నాటి కతని ఖజానానిండ ద్రవ్యముండెను. దేశము సుభిక్షముగనుండెను. 300000 కాల్బలముగల సైన్యము, విశాలదేశము నుండెను. (చూడు రిఫారం ప్యాంఫ్లెట్ - కర్నల్‌పుల్లర్‌టన్ .)

టిప్పుసుల్తానుగూడ చాలా తెలివికలవాడు. అతనిదేశము చక్కగా పాడిపంటలతో తులతూగుచుండుట; పరిశ్రమ లభివృద్ధిలో నుండుట; క్రొత్తపట్టణములు బయలు దేరుచుండుట; వాణిజ్యము బాగుగా జరుగుచుండుట; ప్రజలు సుఖముగా నుండుట చూచిన విదేశీయులనేకు లాతనిపరిపాలనను పొగడియున్నారు. అతనిపైన నాంగ్లేయచరిత్రకారులు వేసిన అపవాదులకు భిన్నముగా అతనియందు ప్రజలు అనురాగమును కలిగియుండుటను దెలిపినారు. (Moore-War with Tippu).

“డిరోం" అను నింకొక గ్రంథకర్తకూడ టిప్పుసుల్తాను పరిపాలనలో మైసూరు సుభిక్షముగా నుండుట వర్ణించినాడు. (Diroms' Narrative). హైదరు టిప్పూలిరువురు అర్ధశతాబ్దమునకు తక్కువగా నేలిరి. ఈఔన్నత్యము కేవలము హైదరు