32
భారత దేశమున
వెలస్లీయొక్క ఉత్తరువులు మద్రాసుకు చేరునప్పటికి అప్పటి కర్నాటక నవాబు ఓమ్‌దల్‌ఉమ్రా అనారోగ్యముగ నుండి తన వ్యవహారములు చక్కబెట్టుకోలేని స్థితిలో నుండెను. తరువాత కొద్దిరోజులలోనే చనిపోయెను. అంతట నీ నవాబు టిప్పుతో ఉత్తరములు నడుపుచుండెనను సంగతియు అందువలన బ్రిటిషుప్రభుత్వమువారు తీసికొన నిశ్చయించిన చర్యను గూర్చియు అతని కొమారునికి తెలియపరచిరి. చిన్న నవాబు దీని కంగీకరింపలేదు. అంతట ఆ యువకుని త్రోసిరాజని క్రొత్తషరతులకు అంగీకరించు పద్ధతిని అతని తమ్ముని కర్నాటక నవాబుగ జేసిరి!
III
మైసూరు
మైసూరు మొదట హిందూరాజ్యము. హైదరాలీయను మహమ్మదీయ సైనికుడు తన తెలివి తేటలవలన నా రాజ్యము సింహాసనము సధిష్టించి పాతరాజును మనువర్తిదారుగ జేసెను.
బ్రిటిషు ప్రభుత్వమువారు హైదరాలీతో సంధిజేసికొని స్నేహముచేసిరి. అయితే మైసూరురాజ్యములోని ఓడ రేవగు బారామహలు నింగ్లీషువారు అక్రమముగా పట్టుకొనగా హైదరాలీకి కోపమువచ్చెను. అతడు మద్రాసు మీదికి దాడివెడలి ఆంగ్లేయులు తసకనుకూలమగు సంధి కొడబడునట్లు చేసెను. దీనివలన నతనిని ఎవరైన నెదిరించినచో నింగ్లీషువారు ఏడుసిపాయి పటాలముల నతనికి సహాయ మంపవలెనని నిర్ణయింపబడెను. .