Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/565

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

75


తయారుసరుకు లెగుమతి చేయబడుట తగ్గిపోయెను. దేశములోని పురాతన పరిశ్రమలు క్షీణించి పోయెను. క్రొత్తవినెలకొల్ప వీలులేకుండ బందోబస్తులు నిషేధములుచేయబడెను.

ఇంగ్లాండులోనుండి ఇండియాకుపంపబడు నూలుసరకులపైన నూటికి 3 1/2 వంతున పన్ను. ఇండియానుండి ఇంగ్లాండు కెగుమతి చేయబడువానిపైన నూటికి 10 వంతుల చొప్పున పన్ను . ఇంగ్లాండుకు ఎగుమతిచేయు పంచదార ముడివస్తువుగాన తక్కువపన్ను. దీనినుండి తయారు కాబడు “రమ్ము" అనబడు సారాపైన అత్యధికపన్ను. ఇండియానుండి ఇంగ్లాండుకు పంపు యినుముపైన అత్యధికపన్ను. ఇంగ్లాండునుండి దిగుమతిచేయు యినుముపైన పన్నేలేదు! ఈ విధానమువలన 1814 నుండి 1835 సంవత్సరముల మధ్యకాలములో నిండియానుండి ఇంగ్లాండుకు పంపబడు నూలుసరకులు నాలుగవవంతుకు పడిపోయెను. ఆ కాలములోనే ఇంగ్లాండునుండి దిగుమతి చేయబడు నూలుబట్టలు ఆరురెట్లకు పెరిగెను. 1815 లో ఇండియానుండి 1300000 పౌనుల ప్రతి ఎగుమతి చేయబడగా నది 1832 లో 100 000 పౌనుల విలువకు పడిపోయెను. ఇంగ్లాండులో నుండి 1815లో 26, 300 పౌనులు నూలుసరకులు ఇండియాకు దిగుమతిచేయబడిన స్థితిపోయి 1832 నాటికి సాలుకు 400,00,000 పౌనులు (60 కోట్లరూపాయల) విలువగల నూలుసరకులు దిగుమతి చేయబడుట గలిగెను. ఇట్లే పట్టుసరుకులు 1828లో 920000 పౌనుల విలువగలవి ఎగుమతి కాగా 1831 - 32 లో 540000 పౌనులకు క్షీణించెను. 1857 నుండి అది