76
భారతదేశమున
మఱియు పూర్తిగా పోయెను. 1828–38 మధ్య ఇండియా నుండి ఇంగ్లాండుకు సాలుకు 28000 పౌనుల విలువ ఉన్ని సరకులు ఎగుమతి చేయబడెను. ఆకాలపు స్థితిపోయి 1857 నాటికి ఇంగ్లాండునుండి ఇండియాలో ఉన్ని దిగుమతి విలువ 300000 పౌనులనుండి 800000 పౌనులకు పెరిగెను.
ఇట్లే పంచదార ఎగుమతితగ్గిపోయి 15 కోట్ల విలువ దిగుమతిచేయు స్థితివచ్చెను. మఱియు గాజు సరకుల పరిశ్రమ క్షీణించెను. తుదకు ఓడల నిర్మాణపరిశ్రమకూడా హిందూదేశములో పూర్తిగా నాశనముచేయబడెను. 1857 నాటికుండిన భారతీయనౌకలసంఖ్య 34286;1898 నాటికి 2302 క్రిందికి తగ్గిపోయెను. తుదకు సాలుకు 132 నౌకలు తిరుగు స్థితికివచ్చెను. కోస్తావర్తకముగూడ బ్రిటీషువర్తకుల వశమయ్యెను. భారతదేశ పరిపాలనమంతయు బ్రిటీషువర్తకులకు ఇంగ్లీషువారికి లాభకరముగా నుండునట్లు చేయబడుచున్నదని చెప్పుటకు ఉప్పుపన్ను చరిత్ర నుదాహరణముగా చూపవచ్చును. ఇంగ్లీషువారి యోడలలో బరువుచాలక ఉప్పువేసుకొనివచ్చుచుండగా దానిని బజారులో అమ్ముటకు దేశవాళీ ఉప్పుపైన పన్నువిధించినగాని ఉప్పుధరహెచ్చి అది చెలామణికాదుగనుక బ్రిటీషుప్రభువులు ఉప్పుపన్ను విధించిరి. ఈ ఉప్పుపన్ను యొక్క రహస్యమిదియె. బ్రిటీషువారి ఆర్థిక లాభవిధానములో నీ పన్ను ఒక ప్రధాన కంబముగనుకనే భారతీయు లెంత మొరపెట్టుకొన్నను నాటికి నేటికి నిది తీసివేయబడలేదు. బ్రిటీషువారు మొదటిలోనే