Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/564

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

భారతదేశమున


V

తూర్పు ఇండియాకంపెనీవా రీ దేశమునకు వర్తకము జేయవచ్చిన మొదటిరోజులలో నింగ్లాండులో పరిశ్రమలు లేవు. అందువలన ఈ దేశపు డక్కా మజిలినులు, రవసెల్లాలు, కాలికోలు, సుగంధద్రవ్యములు, పంచదార, గాజు సామానులు ఇంకను అతిసున్నితమగు వస్తుజాలము పారిశ్రామిక సరకులు ఇంగ్లాండుకు ఐరోపాకు నెగుమతి చేయుచుండిరి. ఇంతలో ఇంగ్లాండులో పారిశ్రామిక విప్లవము కలిగెను. ఆవిరియంత్ర సహాయమున వస్తునిర్మాణమునకు మార్గము లేర్చడెను. దేశపరిశ్రమ లభివృద్ధిగాంచవలెనన్నచో ఇతరులపోటీ నరికట్టవలెను. అంతట కంపెనీవారు భారతదేశ పరిశ్రమలవలన తయారగు వస్తువుల నింగ్లాండులోనికి పంపుటమాని ఈ దేశపరిశ్రమల నొక్కటొక్కటిగా నాశనముజేసి ఇంగ్లాండు యంత్రమగ్గముల పైన నేయబడిన నూలుసరకులు ఇతరవస్తువులు ఈ దేశములోనికి దిగుమతిచేసి ప్రజలు కొనునట్లు చేయసాగిరి. దేశములోని ఎగుమతిదిగుమతులపై సుంకములు విధించుట దేశములోని వ్యాపారములను గూర్చిన కట్టుబాటులు ఈదృష్టితోనే గావింపసాగిరి. ముడివస్తువు లింగ్లాండు కెగుమతి చేయుటలో తక్కువ పన్ను, తయారుసరకులపైన హెచ్చుపన్ను, ఇట్లే ఇంగ్లాండులో నుండి దిగుమతిచేయు తయారుసరులకుపైన తక్కువపన్ను విధింప బడసాగెను. ఇట్లు తమ రాజకీయబలమును అధికారమును తమ దేశ ఆర్థికలాభముకొరకు వినియోగింపసాగిరి. ఈ విధానము ప్రయోగించుటవలన త్వరలోనే భారత దేశమునుండి