Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/561

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

71


కనబడుచున్నారు. సాలియానా బ్రిటిషు ఇండియాలోనుండి సీమకు 30 లక్షల పౌనుల చొప్పున పోవుచున్న ధనము ఈముప్ప దేండ్లకు మామూలు వడ్డీరేటుతో 723,900,000 పౌనులు అయియున్నది.

ఇంగ్లాండునుండి ఇంతధనము వెలుపలికి ప్రవహించిపోయినచో ఆదేశముమాత్రము దారిద్ర్యమున మునుగకమానునా? ఇట్టితరి రోజుకు రెండుమూడు పెన్నీ లు (అణాలు) కన్న కూలి డబ్బులుగిట్టక అవస్థపడు భారతీయుని పై నిదియెంత భారముగా నుండును ?"

మిల్లువ్రాసిన హిందూదేశచరిత్రలోగూడ నీ ధన ప్రవాహ మతికఠినముగా విమర్శింపబడినది.

IV

భూమిశిస్తు ఇతరపన్నులలో పరిపాలన ఖర్చులుపోను ప్రతిసాలున మిగిలిన నికరదేశాదాయము నిట్లు ప్రతిసాలున కంపెనీ వాటాదారుల లాభము క్రింద పంచిపెట్టుటకు సీమకు పంపబడుచున్నను వారికి చాలలేదు. అందువల్ల దానిక్రింద కొంతసొమ్ము కావలసివచ్చినదనియు- తాముచేసిన యుద్దములకు కొంతసొమ్ము కావలసి వచ్చినదనియు చెప్పి మొదట కొంత ఋణము తెచ్చి ఆ ఋణమును దానిపై నివ్వవలసిన వడ్డీనిగూడా మన దేశముపైన బడవేసినారు. ఇదియే మన ప్రభుత్వఋణముయొక్క పుట్టుకచరిత్ర. అనేకరూపములుగా అది వృద్ధియై తుదకునేడు 1300కోట్ల రూపాయిలై సాలు