Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/562

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

భారతదేశమున


1 కి 15 కోట్ల రూపాయిలు దానిపైన వడ్డిక్రిందనే చెల్లించుచున్నాము. ఆఋణముపై నింతవరకు చెల్లించిన వడ్డీ అసలు ఋణముకుమించినది. దీనిలో 729 కోట్ల 40 లక్షలు కేవలము ఆంగ్లేయులలాభముకొరకే వినియోగింపబడి యుండెను. మిగతా 400 కోట్లు మనదేశములో దుబారాఖర్చుతో నిర్మింపబడిన రైళ్ళువగైరా పనులకొరకు ఖర్చుఅయినది.

సంవత్సరము ఋణస్వభావము మొత్తము
1792 లో పైనచెప్పినట్లు కంపెనీచేసినది 70 లక్షల పౌనులు
1799 లో నది 100 లక్షలుగా పెరిగినది
1805 లో నిది 210 లక్షలు
1807 లో నిది 270 లక్షలు
1829 లో నిది 300 లక్షలకు పెరిగినది.
1857 నాటికి 59 1/2 కోట్లరూపాయిలుగా పెరిగెను.

ఇందులో 1857 కు పూర్వముకంపెనీవారి దేశాక్రమణ యుద్ధములకొరకైన వ్యయము 35 కోట్లు రూ

1833 మొ|| 57 వరకు కంపెనీవారికి వాటాలపైనవడ్డీ క్రింద నిచ్చినది 15 కోట్ల 12 లక్షలు - 50 కోట్ల 12 లక్షలు

1857 లో సిపాయివిప్లవమణచినందుకని - 40 కోట్లు రూ