70
భారతదేశమున
యుండును. అట్లుచేయక దానిని సీమకు గొనిపోయి కంపెనీ వాటాదారులకు లాభముక్రింద పంచిపెట్టబడుచున్నందున నీదేశము నానాటికి దరిద్రమైపోయి ప్రజలకు సౌకర్యములు లేక దుర్దశవచ్చినది. 1790 లో గనర్నరుజనరలుగ నుండిన కారన్‌వాలిస్ “పైవిధముగా నీదేశమునుండి సీమ కిట్లు సొమ్ము పంపబడుచున్నందువల్లను ప్రైవేటుగా పంపబడుచున్న విశేషధనమువల్లను, భారతదేశ జవసత్వములెల్ల హరించిపోవుచున్నవి అందువల్ల నీదేశముయొక్క పాడిపంటలు, కృషిసంపద, వాణిజ్యము క్షీణించుచున్నవి" అని కంపెనీవారికి మినిట్సులో వ్రాసినాడు. 1787 లో 'సర్ జాన్‌షోరు’ "ఈకంపెనీవా రీదేశములో వర్తకులేగాక ప్రభువులుగా నున్నారు. వర్తకులుగా దీని వ్యాపారమెల్ల కొల్లగొనుచున్నారు; పరిపాలకులుగా దీని ఆదాయమెల్ల మ్రింగుచున్నారు. ఈ దేశముయొక్క నికరాదాయము సీమకంఫుటలో రొక్కముగా గాక దానివిలువకు సరిపడిన ముడిపస్తువులు సీమకంపబడుటవలన నిజముగా నీ దేశసంపదయే సీమకు తరలిపోవుచున్నది. కంపెనీవారి పరిపాలనము వలని లాభముకన్న పరాయివా రిట్లు దేశముయొక్క భాగ్యభోగ్యములు తరలించుకొని పోవుటలోని నష్టములే అధికముగా కనబడుచున్నవి" అని వ్రాసినాడు.
వంగరాష్ట్రములో 1807- 1814 కు మధ్య సర్వేలు జరిగినవి. వీనిని గూర్చి విమర్శించుచు మాంట్గొమరీమార్టిను 1835లో నిట్లు వ్రాసినాడు “ఈసర్వేనుబట్టిచూడగా ఈదేశము సకలసంపదలకు నిలయమే గాని ఇందలి ప్రజలతిదరిద్రులుగా