పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/558

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

భారతదేశమున


హక్కులను రైతులనుండి తీసివేసి ఆ భూములపైన తమకు సాలున కింతయని శాశ్వతశిస్తు లేక పేష్కష్ ఇచ్చు పద్దతిని తమ క్రింద నదివరకు పన్నులువసూలు యిజారాలు పొందియున్న దళారీలకు ఆ జమీలనొసగి జమీందారీపద్దతి నెలకొల్పి దీనికే పర్మనెంటు సెటిల్మెంటనిరి. మదరాసురాజధానిలోని తక్కినచోట్ల నీ శాశ్వత పైసలాగాక తామేభూమిహక్కులువహించి తమ కలెక్టరుద్వారా రైతులకు పట్టాలిప్పించి ఏసాలుకాసాలు భూమిశిస్తు వసూలుచేయు రైత్వారీపద్దతి స్థాపించిరి. ఈ రెండు పద్దతులందును భూమిశిస్తు అత్యధికముగానేయుండి దానిని వసూలుచేయుటకు క్రూరపద్దతు లవలంబింపబడెను.

కంపెనీ వంగరాష్ట్రమున పన్నుల వసూలుహక్కు పొందునాటికి

1764–65 మధ్య భూమిసిస్తు 818000 పౌనులుండెను.

1765-66 కంపెనీపరిపాలనయొక్క మొదటిసాలున 1470000

1790–91 నాటికి 2680000 పౌనులయ్యెను.

1812-13 లో 40 లక్షల 90 వేల పౌనులనుండి

1822 - 23 నాటికి ఒక కోటికి 36 లక్షల పౌనులయ్యెను.

1857-58 నాటికి ఒకకోటి 57 లక్షలయ్యెను.

కంపెనీవారును భూస్వాములును కలిసి రైతుల నిట్లు పీడించుటవలన కరవు లధికమయ్యెను. వంగరాష్ట్రమున 1770 లో వచ్చిన కఱవులో ఒక కోటిమంది మరణించిరి. ఆ రాష్ట్రములో మూడవవంతు మంది మరణించి నందువలన వ్యవసాయభూమి క్షీణించిననుగూడా 1771 లో వసూలుచేయ