బ్రిటీష్‌రాజ్యతంత్రము
67
మతులరూపమున లంచములు పుచ్చుకొనుటతో ప్రారంభమైనది. 1757 మొదలు 1766 వరకు అట్లు పుచ్చుకొన్న బహుమతుల మొత్తము 60 లక్షల పౌనులనిఅంచనా వేయబడినది. ప్రాతమారకపురేటు ప్రకారము నవరసు 15 రూపాయిల చొప్పున నిది 9 కోట్ల రూపాయిలని మనమూహించవచ్చును. నాటికంపెనీయుద్యోగులలో క్లెవు ఒక్కడేవంగరాష్ట్రనవాబువల్ల పుచ్చుకొనిన బహుమతులు కొన్ని వేల నవరసులుండెననగా తక్కిన అసంఖ్యాకులగు నుద్యోగులు వసూలుచేసి సీమకంపిన సొమ్మెంతయుండునో ఊహించవచ్చును.
కంపెనీవా రీదేశమునుండి సీమకు తీసికొనిపోవుట కవలంబించిన రెండవమార్గము ఈదేశమున తాము ఆక్రమించిన రాజ్యములందలి పన్నులవలన వచ్చిన దేశాదాయములో సామాన్య సివిలుపరిపాలనకు గావలసిన ఖర్పులుపోగా మిగిలిన నికరాదాయమెల్ల సీమకుపంపి కంపెనీ వాటాదారులు లాభముల క్రింద పంచుకొనుట. ఈ దేశాదాయములో కొంతభాగమైనను. ఈ దేశప్రజల సౌకర్యములకొరకుగాకపోయినను తామువసూలు చేయుచుండిన అత్యధిక భూమిశిస్తు కాధారభూతమైన పల్లపుసాగు కవసరమైన నీటి వనరులకైనను ఖర్చుచేయక పన్నుల వసూలకొరకు తా మేర్పరచిన ఉద్యోగుల జీతములు స్వల్ప వ్యయములుపోను తక్కినసొమ్మంతయు సీమకు తరలింపసాగిరి.
ఈ భూమిశిస్తు లేక పన్నుల వసూలుకొరకు రెండుపద్దతు లవలంబించిరి. వంగరాష్ట్రములోసు, బీహారు సంయుక్త రాష్ట్రములలోను మద్రాసులో కొన్నిచోట్లను భూముల