పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/559

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

69


బడిన నికరాదాయము 1768 నాటికి మించినదని వారన్ హేస్టింగ్స్ సీమలోని కంపెనీ డైరెక్టర్లకు వ్రాసెను.

III

ప్రత్యేకవ్యాపార హక్కులు ఇజూరాలవల్ల రాజకీయములందలి లంచగొండెతనము వల్ల భరింప రాని భూమిసిస్తులవల్ల కంపెనీవారు భారతదేశములోనుండి సాలియానా ఎంతో ధనమును నికర లాభముగా సీమకు పట్టుకొని పోవుచుండిరి. ఈ ప్రకారముసీమకు నిరంతరధనప్రవాహము ప్రారంభమైనది. 18 వ శతాబ్ద ప్రారంభమున అనగా 1772 మొదలు. 1835 వరకు ఈ ధనప్రవాహము సాలుకు 30 లక్షల పౌనులుగా నుండెనని అంచనా వేయబడినది. ప్రైవేటుగా పంపబడు సొమ్ముతోకలిసి సాలుకు 50 లక్షల పౌనులుండెనని అంచనా వేయబడినది. ఈ ప్రవాహము నానాటికి వృద్ధియైనది. 1835– 1839 మధ్య దామాషాగా సాలు 1కి 5,347,000 పౌనులు పోవుచుండెను 1855–1859 కి మధ్య ప్రతిసాలున 7,730,000 పౌనుల చొప్పున పోవుచుండెను.

ఇట్లు సీమకు పోవుచుండిన నిరంతర ధనప్రవాహముల వలన ఆంగ్లేయ పరిపాలనక్రింద మనదేశము నానాటికి దరిద్రమై పోవుచున్నదనియు పూర్వపురాజుల నిరంకుశపరిపాలనలో ప్రజలెట్టి బాధలు పడుచున్నను దేశముమాత్రము సుభిక్షముగ నుండెడిదనియు సర్. ఆర్. గ్రాంటుగా రిది చూచి 1836 లో వ్రాసియున్నారు. ఈ దేశాదాయమునెల్ల నీ దేశములోనే కర్చు పెట్టినచో ప్రజలకు క్షేమ లాభములు గలిగి,