పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/547

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

57


మించెను. ఇప్పటి కీనాటకము ఆరంభమై 6 సంవత్సరములు గడచినవిగాని ఇదిపూర్తి కాలేదు.

ఐదవ యంకము ప్రారంభ మయ్యెను. ఈ వైటుపేపరు ప్రణాళికను వడపోసి సారవిహీనముచేయుట కొక జాయింటు పార్లమెంటరీకమిటీ నియమింపబడెను. మఱల కొందరు భారతీయులు రంగస్థలముపై కెక్కింపబడి మరల దీర్ఘవిచారణలు, చర్చలు ప్రారంభింపబడి, రాజ్యాంగమింకను సారవిహీనము చేయబడి, జూలై 1934 లో నొక నివేదిక ప్రకటింపబడినది. తరువాత పార్లమెంటులో కనివిని యెరుగని యొకవిపరీతపు రాజ్యాంగమును నిర్మించుచు డిశంబరు 1935 లో చట్టము చేయుటతో పంచమాంకము పూర్తియైనది.

III

ఇట్లే నాటకమున అనేక అంతర్నాటకములు, ప్రవేశములు, నిష్క్రమణములు, అపవారితపు సంభాషణలు, ఏకాంత సంభాషణలు, న్వగతములు, విష్కంభములు జరుగగా ఈ నాటక ఫలితముగా నీమాయశిశువు జన్మించెను. చూడగా చూడగా నీమాయ రాజ్యాంగము కేవలము సైమనుగారి శిశువుగానే కనబడుచున్నది. నేడు మన రాజకీయకులము పాలిటికి ముసలమైన సంస్థానములును రాష్ట్రములును కలిసిన రాజ్యంగసమాఖ్య ( ఫెడ రేషను) ఊహను గర్భాధారణముచేసినవా డాసైమను సాంబడే. అతడు తన నివేదికలో సూచించిన రాష్ట్రీయపరి