58
భారతదేశమున
పాలనమే నేడు మరికొన్ని మినహాయింపులతోను అడ్డంకులతోను ఇంకను సారవిహీనముగ చేయబడి మనకీరూపమున ప్రసాదింపబడినది. అతడు సూచించినట్లు సర్వాధికారములెల్ల పార్లిమెంటులోను వారితాబేదారులగు గవర్నరుజనరలు
యొక్కయు గవర్నరులయొక్కయు చేతులలోను ఉంచబడి ప్రజాప్రతినిధులగు మంత్రుల ప్రభుత్వమనునది కేవలము నిర్గంధకుసుమముగా మాత్రమేగాక దుర్గంధకుసుమముగా గూడ చేయబడినది. అట్లైనచో నీమాత్రపు రాజ్యాంగసంస్కరణ ఆ సైమనుకమిటీ నివేదిక ప్రకటింపబడిన మరునాడే చేయవచ్చునే ! ఏల నిన్ని సమాలోచనములు; ఇన్ని
ఈ భారతీయ బొమ్మలకొలువు సభలు, అందలిచర్చలు; ఇంత ధనవ్యయము : దీని కంతకును కారణము లేకపోలేదు. దీనికెల్ల బలవత్తరమైన మూలకారణము. బిటీష్ రాజ్యతంత్రమే. 1919 సంవత్సరపు రాజ్యాంగచట్టములో ప్రకటించిన ఉద్దేశ్యానుసారముగాను తరువాత బ్రిటీషు ప్రభుత్వము చేసిన ప్రకటనలవల్లను ఈ రాజ్యాంగమునం దేదో కొంత మార్పు, ఏదో కొంత సంస్కరణము, చేయక తప్పదయ్యెను. అయితే ఈ మార్పువలన ఈ సంస్కరణమువలన బ్రిటీషు సామ్రాజ్యము బ్రిటీషు వర్తకులు వృత్తివంతులు ఈ భారతదేశమువలన పొందుచున్న అమిత లాభములయం దావంతయైన కొరతకలుగరాదు. ఇప్పుడేకాదు; ఇకముందెన్నటికిని గూడ బ్రిటీషువారి కీ దేశమువలన కలుగుచున్న విశేషలాభముల కెట్టి భంగము కలుగరాదు. అందుకు వలసినబందోబస్తులు