Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/546

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

భారతదేశమున


రాజ్యాంగమున అనేకరక్షణలు కావలెననియు, ప్రత్యేకనియోజకవర్గములు గావలెననియు, పలికించి భారతదేశ పారతంత్ర్యమును శాశ్వతముగా నుంచగల వరము లనేకములు గోరించిరి. ఈవరములను పాలించుటకు బ్రిటీషు ప్రభుత్వమునే మధ్యస్థులుగా నుండుడని కూడ ఈకీలుబొమ్మలు కోరిబ్రిటిష్‌వారి మెప్పునందిరి. భారతదేశ రాజకీయములందు మొదటినుండియు విడదీసి పాలించు బ్రిటిషువారి కుటిలనీతి ఇట్లు సఫలత గాంచినది. ఏకక్రియా ద్వ్యర్థకరీ యనునట్లు భారతదేశములో కాంగ్రెసుకు జాతీయ వాదులకు పలుకుబడిలేదని ప్రకటించుట, భారతదేశమునకు బ్రిటిషువారు శాశ్వతముగా అధికారులై యుండి తీరవలెనని భారతీయుల నోటనే సభాముఖమున ప్రపంచమునకు జాటచేయుట ఒక్కసారిగనే చేయగలిగిన ఈబ్రిటీషువారి రాజ్యతంత్రము. చాణక్య నీతిని గూడా తలదన్నెను. బ్రిటీషు రాజ్యతంత్రము సఫలతగాంచినది. ఇట్టి స్థితిలో కాంగ్రెసును అణచివేయుటకు నాటి రాజప్రతినిధియగు విల్లింగ్డన్ ప్రభువు తీవ్రనిర్బంధ ప్రయోగము గావించి కాంగ్రెనువారిని జైళ్లలోపెట్టి ఆర్డినెన్సులవల్ల పరిపాలన సాగించుచూ మరల కొందరు కీలుబొమ్మలను రంగస్థలమునకు రప్పించి మూడవ రౌండుటేబుల్ నాటకము నాడుటయు, తరువాత ప్రత్యేక నియోజకవర్గములు, అన్ని అధికారములు మినహాయింపబడిన బాధ్యతలేని పరిపాలన పద్ధతియుగల వైటుపేపరు , ప్రణాళిక ప్రకటించుటతో 1933 నాటికి రాజ్యాంగ నాటకములో నాలుగవ యంకము పూర్తియై కీలుబొమ్మలు నిష్క్ర