పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/540

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

భారతదేశమున


స్వేచ్చగా సీమకు తరలించుచుండిరి. తరువాత దేశములో నీపారతంత్ర్యముపైన విరోధభావముకలిగి సిపాయివిప్లవము జరిగినది మొదలు దేశములో రాజకీయ పరిజ్ఞానము క్రమక్రమముగా వర్ధిల్లి తుదకు ప్రజాభిప్రాయమును నిర్భయముగా ప్రకటించు ప్రజాసంస్థ యొకటి 1885 లో కాంగ్రెసు రూపముగా వెలసి బ్రిటిషు పరిపాలనావిధానమును విమర్శించుచు దేశప్రజలకు హక్కులుకోరుటయు ప్రారంభముకాగా నాడుమొదలు బ్రిటీషువారు ఒకవంక నీ తీవ్రరాజకీయ ప్రజాభిప్రాయమును రాజద్రోహమని అణచుటకును, ఇంకొకవంక ఏవో కొన్ని కల్లబొల్లికబురులుచెప్పి స్వల్పపురాజకీయ సంస్కరణములు గావించినట్లు నటించి భారతదేశ ప్రజలలో కొందరిని చేరదీసి బుజ్జగించి బ్రిటీషు పరిపాలనవలని లాభములను గూర్చి ప్రచారముగావించునట్లు చేయుచు బ్రిటీషు రాజ్యతంత్రములో కీలుబొమ్మలగా నుపయోగించి ఒక కపటనాటకము నాడసాగిరి. ఈకపటరాజ్య తంత్రనాటకమున ప్రధమాంకములోనే కొన్ని దేశీయపత్రికలఅధిపతులు రాజద్రోహనేరమున కాహుతియైరి. లోకమాన్యతిలకునిగూడ చెరకంపిరి. ఈ నాటకసందర్భముననే, బొమ్మలకొలువు లనదగు శాసన నిర్మాణసభలు 1893 లో స్థాపింపబడెను.

అంతట నాటకములో రెండవయంకము ప్రారంభమైనది. రాజప్రతినిధిగా కర్జనుప్రభువు రంగస్థలమున బ్రవేశించగా నతని నిరంకుశపరిపాలనా ఫలితముగా దేశములో స్వదేశీయుద్యమము, రాజకీయాందోళనము వందేమాతరం