పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/541

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

51


ప్రబోధము ప్రారంభమైనది. కర్జను నిష్క్రమించగా మార్లేప్రభువు రాజ్యాంగమంత్రిగా మింటోప్రభువు రాజప్రతినిధిగా రంగమున ప్రవేశించిరి, తీవ్రజాతీయవాదులను రాజద్రోహమునకు చెరలకంపి జాతీయభావము నణగద్రొక్కి వేసి తరువాత శాసనసభల సంస్కరణల ప్రణాళిక నాటకమునాడి మితవాదులను జేరదీసి తమ నిరంకుశ పరిపాలనమును వారి సహాయముతో సాగించిరి.

బ్రిటీషు రాజ్యతంత్ర నాటకమున మూడవయంకమున అనీ బిసెంటుకు లోకమాన్యుడు తోడై దేశములో తీవ్ర స్వరాజ్యాందోళన ప్రారంభముకాగా ప్రభుత్వమువారు నిర్బంధ విధానముతో ప్రజాభిప్రాయము నణగద్రొక్కిరి. అయి తే ఐరోపాసంగ్రామమున మనసహాయము గావలసివచ్చి భారతదేశమునకు బాధ్యతాయుత పరిపాలనము నిచ్చెదమని మాంటేగుచేత ఆపద మ్రొక్కులు మ్రొక్కించి ఆపదగడువ బెట్టుకొని ఘోరరౌలటుశాసనమును ప్రయోగించి స్వాతంత్ర్యముహరించి పంజాబువధల భీభత్సముజరిపి కొన్నిరంగములు ప్రదర్శించి, ఎట్టకేలకు మసిబూసి మారేడుకాయజేసి 1919 లో సారవిహీనమైన రాజ్యాంగ సంస్కరణముచేసి ద్వంద్వ పరిపాలనను స్థాపించగా నీరాజ్యాంగనాటకమున నాలుగవయంకము ప్రారంభమైనది.