బ్రిటీష్‌రాజ్యతంత్రము
49
స్థాపించిన పిదప నీరాజకీయాధికారముల నెల్ల తమ ఆర్థికలాభముకొర కుపయోగించుకొను పద్దతిని ప్రారంభించగా ఈదేశ భాగ్యభోగ్యము లెల్ల వారి వశమై మనము నానాటికి దరిద్రులు మగుట జరిగినది. మన పూర్వపరిశ్రమలు ఎగుమతి వ్యాపారము నశించి బ్రిటిషు వస్తువులు కొనుట ప్రారంభమై మనకు ధనము వచ్చుటకు బదులుగా మన దేశమునుండి సాలియానా కోట్ల కొలది ధనము సీమకు తరలింపబడసాగినది. ఇంగ్లీషువా రీ దేశమున అడుగిడినది మొదలు
భారత దేశములోని భూభాగముల నెల్ల ఆక్రమించుటకు రాజులనెల్ల లోబరచుకొనుటకు ఎన్నో తంత్రములు పన్ని రాజకీయాధిపత్యమును సంపాదించినది. ఇందుకొరకే. నాటి రాజ్యతంత్రమెల్ల ఈ యుద్దేశ్యముతోనే జరుపబడెను. తరువాత 1858 మొదలు నేటివరకు తాము సంపాదించిన రాజుకీయ సామ్రాజ్యములోని ఆధిపత్యమును దీనివలన పొందు ఆర్థిక లాభములను నయముననో భయముననో ఉపాయము వలననో నిలుపుకొను నుద్దేశ్యముతోనే ఈ బ్రిటిష్ రాజ్యతంత్రము ప్రయోగింపబడుచున్నది.
భారతదేశమున రాజ్యస్థాపనము చేయబడుచుండిన మొదటి దినములలో బ్రిటిషురాజ్య తంత్రము దేశాక్రమణకొరకు దేశములో తమప్రభుత్వమును సుస్థిరముగా స్థాపించుటకు వర్తకలాభము పొందుటకు నిర్భయముగా ఉపయోగింపబడెను. నాటి కీదేశప్రజలు నోరులేనివారు. ఎట్టి జంకును లేకనే దేశముయొక్క భాగ్యభోగ్యముల నీకంపెనీవారు