పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/530

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

భారతదేశమున


వలన మన ప్రాథమిక విద్యావిధానము పుచ్చిపోయి మన విద్యార్థులు పాడగుచున్నారు. దానిని వెంటనే సంస్కరించుట మన మంత్రుల కర్తవ్యము. నేటి పంతుళ్ళ యొక్కయు పంతులమ్మలయొక్కయు శక్తి సామర్ధ్యములను వెంటనే పరీక్ష జరిపి చూచి తగనివారిని తీసివేసి మంచివారిని నియమించుట అత్యంతావశ్యకము. భారతదేశ ప్రభుత్వమును చేయవలసిన పౌరులను తయారుచేయవలసిన విద్యావిధానమును వెంటనే నిర్ణయించి అమలులో పెట్టవలయును. ఎన్ని శాసనములు చేసినను సంస్కరణములుగావించినను ఇదిచేయనిదీ మనము బాగుపడము.

ప్రభుత్వ వైద్యాలయములందు బీదజనులకు మందుల పేరు చెప్పి ఏదో రంగునీళ్ళనిచ్చి పంపుటయు, వీరికొఱకుకొన్న పాలు అధికారులు త్రాగుటయు, వీరికేర్పడిన వైద్యసహాయము ధనికులకిడుటయు, లంచములపద్దతియు, వెంటనే నిర్మూలింపవలెను. సహకారశాఖలోను, వ్యవసాయ పారిశ్రామిక శాఖలందును ప్రజాసేవపేరున జరుపబడుచున్న కపటనాటకము నంతమొందించి, ఆ శాఖోద్యోగులు ప్రజలకు నిజమైన సేవ చేయునట్లు చూడవలెను.

అనేకతరములనుండి నిరంకుశపరిపాలనమున బాధల నంది దారిద్ర్యమున అవిద్యాంధకారమున మునిగియుండిన రష్యాదేశమున ఐరోపాయుద్ధానంతరము జరిగిన ప్రజావిప్లపము వలన సోవియటుసామ్యవాదుల ప్రజాపరిపాలన ఏర్పడినది. ఈనూతనప్రభుత్వము స్థాపింపబడిన పదేండ్లలో ప్రజలెల్లరు విజ్ఞానవికాసమును బొందిరి. కర్షకులు, కార్మికులు, పాటకపు