పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/531

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

41


జనముగూడ తమ దేశపరిపాలనమున పాల్గొని తమక్షేమలాభముల కొరకు దానిని నిలుపుకొనగలగు శక్తిసామర్ధ్యము లేర్పడినవి. ఈపరివర్తన అచ్చటి ప్రజాప్రతినిధులగు మంత్రులు చేసిన సంస్కరణలవలననే జరిగినది. ఈ సంస్కరణలలో కొన్నిటినైన మనము పరిశీలించి వానిని స్వీకరించి అమలు జరుపవచ్చును.

సోవియటు రాజ్యములోని వ్యవహారములు మార్చ వీలులేనట్లు స్థిరముగా నినుపచట్రములలో బిగియింపబడవు. ఏ శాఖలోనైన నేదైన లోపము కనబడినచో నది వెంటనే సవరింపబడును. ప్రతి ప్రభుత్వకార్యాలయములోను లోటుపాటులు వ్రాయగలందులకు ఫిర్యాదులు వ్రాయగలందులకు ఒక బోర్డు బల్ల యుంచబడును. దానిపైన నెవరేమి వ్రాసినను జాగ్రత్తగా విచారింపబడి నిజమున్నచో తగుచర్య గైకొనబడును. సోవియటు పాఠశాలోపాధ్యాయులు సైతము అప్పుడప్పుడు పరీక్షింపబడి వారి శక్తియందు లోపములు కనబడినచో వారు తీసివేయబడుదురు.

సోవియటు రాజ్యములోని విద్య యనేక మార్గముల నభివృద్ధిని గాంచుచున్నది. సినీమాద్వారమున ప్రజల సాంఘికాచార జీవనములు, దుస్తులు, పండుగలు, శరీరశాస్త్రము, ఖగోళశాస్త్రము, మున్నగు ప్రకృతి శాస్త్ర విషయములు, - శిశుసంరక్షణము, ప్రసవవైద్యము జన్మనిరోధము, ప్రజారోగ్యము మున్నగు విషయములెల్ల చక్కగా ప్రజలకు బోధింపబడును. ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు నూరూరదిరిగి తమ