పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/529

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

39


తనిఖీ చేయుటకు సంస్కరణములను గూర్చి సూచించుటకు తగు అవకాశ మివ్వవలెను. అట్లు చేయబడిన సూచనలను మన్నించి ఆసంస్కరణములు చేయవలెను. ఇట్లు చేసినచో మంత్రులు నిర్ణయించు ప్రజాసేవ చక్కగా నెరవేరగలదు.

కాంగ్రెసు సంఘములు గూడ చాల జాగ్రత్తగా ప్రవర్తింపవలెను. గాని తొందరపడరాదు. నేటి జిల్లా కాంగ్రెసు సంఘములు గూడ సంస్కరింప బడవలెను. ఏలననగా దీనిలో స్వార్థపరులు చేరగా పార్టీలుబయలుదేరి పూర్వపు జస్టిస్ పార్టీలను తలదన్ను చున్నవి.

నేడుమనకాంగ్రెసు ప్రభుత్వమువారు హెచ్చుగా శాసననిర్మాణములో నిమగ్నులైనారు. ఇదిచక్కగానే యున్నది. కాని వెంటనే తీరికచేసుకుని తక్కినరాష్ట్రము లందువలెనే పరిపాలనశాఖ లన్నియు వెంటనే సంస్కరించి పరిపాలించుట యావశ్యకము. మరియు ఇతర సంస్కరణలను గూడ తక్షణము చేయవలెను.

నేటి ప్రాథమిక పాఠశాలలందు పనిచేయు ఉపాధ్యాయులు విద్యాగంధములేక, నీతి నియమములులేక వేరే మార్గమున బ్రదుకలేనిచో బడిపంతులు ఉద్యోగము చేయుటకు వచ్చి ఇనస్పెక్టర్లకు పిండివంటభోజనములిడి లంచమిచ్చి బ్రదుకువారుగా నున్నారు. చాలమంది పంతులమ్మలకు వర్ణక్రమమురాదు. ఇటీవల విద్యాధికారి “ స్టేతం” గారు ప్రకటించిన నివేదికలో చెప్పబడిన ప్రాథమిక పాఠశాలలందలి ఘోరాన్యాయములం దావంతయైన నతిశయోక్తిలేదు. ఆ లోపముల