Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

భారత దేశమున


ఫ్రెంచివారికన్న తాము హెచ్చులాభము పొందవలెనని తలచియే ఆంగ్లేయులు దేవికోట నాశించియుండిరి. 1754 లో ఆంగ్లేయులును ఫ్రెంచివారును సంధిజేసికొనగా నిక నీ కర్నాటక నవాబురాజ్యమున కీ విదేశీయులవలన నేబాధలు కలుగవని తలచిరి, గాని త్వరలోనే ఇది పొరబాటు అని తేలినది. ఆంగ్లేయుల స్నేహితుడగు మహమ్మదాలీ కర్నాటకనవాబుగా నంగీకరింపబడెను. అంతట నతనికి గప్పములివ్వక తిరుగుబాటుచేయుచున్న కొందరు హిందూసామంతరాజుల నణచుటకు ఆంగ్లేయులు తలపెట్టిరి. పాండుచేరీలోని ఫ్రెంచివారు దీనికి తమ యసమ్మతిని తెలిపిరి. అంతట కలహములు కలిగెను. ఫ్రెంచివా రోడిరి. ఫ్రెంచివారితో చేసిన యీ యుద్దముకొరకు ఆంగ్లేయులకైన ఖర్చుల క్రింద కర్నాటకనవాబు ఆంగ్లేయవర్తక కంపెనీవారికి సాలుకు 280000 పౌనులు లేక 28 లక్షలరూపాయల చొప్పున నిచ్చునట్లు విధించి 1763 లో నతనితో నొక సంధి పత్రము మీద సంతకము చేయించిరి. కొన్ని భూములయొక్క శిస్తులను ఆదాయమును ఈ బాకీక్రింద జమకట్టు ఏర్పాటుతో ఆ భూములను కంపెనీ కిచ్చునట్లు కంపెనీవారు నవాబుతో ఏర్పాటు జేసిరి. నవాబు మారుమాటాడకుండ దీనికఁగీకరింపవలసి వచ్చెను. నవాబువలన జాగీరులందిన ఈ జాగీరుదారులే నిజముగా నవాబునకు యజమానులుగానుండిరి. ఆంగ్లేయులు దక్షిణ హిందూస్థానమున నడుగిడునప్పుడు వీరికి నిలువనీడలేదు. వారికి మొట్టమొదట సహాయము చేసినవాడు కర్నాటక