పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/519

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

29


IV

ప్రభుత్వనిర్వహణమునందలి కష్టసుఖములు.

పరిపాలనయంత్రము:- దేశపరిపాలనము ప్రభుత్వనిర్వహణము సామాన్యకార్యములుకావు. అందు ముఖ్యముగా దేశము పారతంత్ర్యముస బడియుండి దేశప్రజ లజ్ఞానులై నోరులేనివారైనప్పుడు దేశసేవయు ప్రజాసేవయు చేయుట మరింతకష్టతరము. మరియు మనభారతదేశరాజకీయములందు మనజాతీయ ప్రభుత్వమునకు ఇంకను కష్టతమమైన పరిస్థితులేర్పరుపబడియున్నవి. రాజ్యతంత్రముగ్గు పాలుగా నభ్యసించిన ఆంగ్లేయరాజ్యనీతిజ్ఞులు దేశములో జాతీయతను విచ్చిన్నము చేయుటకు నీ రాజ్యాంగమున అనేకభేదోపాయములను కల్పించియున్నారు. పార్లమెంటు యొక్క సర్వాధికారము, వారితాబేదారులగు రాజప్రతినిధియొక్కయు గవర్నర్లయొక్కయు విశేషాధికారములు నీరాజ్యాంగములను కత్తులబోనుగాజేసినవి. ప్రజల కేయుపకారము చేయవలయునన్నను ఎదోయొక వాడికత్తిపై అడుగుపడితీరును. మంత్రుల యాజ్ఞలెల్ల నిర్వహించవలసినవారిలో ముఖ్యలు ఐ. సి. యస్ . ఉద్యోగులు. ప్రాతనిరంకుశ ప్రభుత్వయంత్రమునెల్ల నడిపినది వీరే. ప్రాతప్రభుత్వస్వరూపమున కొన్నిమార్పులు జరిగినను ఈ ఐ. సి. యస్. ఇనుపచట్రములో నెట్టిమార్పును చేయబడలేదు. ఇందువలన ప్రజలకు బాధ్యులగు మంత్రులక్రింద మంత్రులకు బాధ్యతవహింపని ఐ. సి. యస్. వారు నెలకొల్పబడుటవలన ప్రభుత్వ యంత్రమును నడుపుట ఎంత