Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

భారతదేశమున

ఏదియెట్లున్నను ఖైదీల విడుదల మంత్రుల యధికారము క్రిందజేరిన సామాన్య పరిపాలనకు సంబంధించిన విషయము. అందువలన కాంగ్రెసు మంత్రులు ఈ కొద్దిమంది ఖైదీలను విడుదలచేయుచు జారీ చేసిన ఉత్తరువులను గవర్నరుజనరలు తనయొక్క శాంతిభద్రతల కేర్పడిన విశేషాధికారము నుపయోగించి రద్దుచేయుట రాజ్యాంగ ధర్మవిరుద్ధమని రాష్ట్రీయ స్వపరిపాలనకును లోగడ చేయబడిన వాగ్దానములకును భంగకరమనియు మంత్రుల యాత్మగౌరవమునకును భంగకరమనియు నిశ్చయించి సంయుక్త రాష్ట్ర బీహారుల లోని కాంగ్రెసు మంత్రులు ఫిబ్రెవరు 15 తేదీన రాజీనామా నిచ్చిరి. ఈ విషయము దేశములోను ఇంగ్లాండులోను గూడ తీవ్రముగా చర్చింపబడి మనమంత్రులదే న్యాయపక్షమని నిర్ణయింపబడినది. హరిపురకాంగ్రెను ఫిబ్రేవరు 20 వ తేదీన జరిగెను. గాంధిమహాత్ముని ప్రభావమువలన ఈవిషయమునుగూర్చి అతినిపుణమైన తీర్మానము చేయబడెను. అంతట రాజప్రతినిధియు గవర్నరులుగూడ తమపొరబాటు సవరణ జేసికొని మనమంత్రులతో సఖ్యతచేసికొనిరి. ఇట్లు సామాన్య పరిపాలన మందు మంత్రుల పరిపాలన కాటంకము చేయరాదను రాజ్యాంగమర్యాద యొకటి యేర్పడినది.