30
భారతదేశమున
కష్టమో అనుభవించిన తెలియునేగాని యూహింవనలవిగాదు. ఇప్పుడుగాకపోయిన ముందైనను ఈచిక్కులెల్ల క్రమక్రమముగా దలలెత్తగలవు. మనమంత్రులను జీకాకుపర్చుచున్నపరిస్థితు లిప్పటికే గలవు.
బ్రిటీషు పార్లిమెంటువారు, గవర్నరుజనరలు గవర్నరుల ద్వారా తమ సర్వాధికారములను చలాయించి మనమంత్రుల పరిపాలనకు వెంటనే అడ్డుతగులకపోయినసు ఎన్నటికైనను తగవులురాకతప్పదు. మన ప్రజలకుక్షేమలాభములు కలిగింపవలెనన్నచో బ్రిటీషువారికి నష్టముకలుగకతప్పదు. తక్షణమే లోపల నణగియున్న విశేషాధికారములు త్రాచుకోరలవలె ప్రయోగింపబడితీరును. బ్రిటీషువారి పలుకుబడి యింకను మిగిలియున్నది. ప్రాపకము, గౌరవపట్ట ప్రదానము, పదవులు, బిరుదులు ఒసగబడుచు ప్రజలలో కొందరికి వ్యామోహము కలిగించుచునేయున్నవి. ఎంత విధేయత కనబరచుచున్నను బ్రిటీషు రాజ్యతంత్రమునకు మూలకంబములగు నీ ఐ. సి. ఎస్. ఉద్యోగులు లోలోపల ప్రాతనిరంకుశ పద్దతులతో వ్యవహరించుచునేయున్నారు. డెక్కు బంగాళా, మోటారుకారు, జమాబందీ పద్దతులు జరుగుచునేయున్నవి. అనుశృతమైన జరీతలపాగలు, నల్లకోటులు, మల్లుపంచలు ధరింపనక్కరలేదని మన కాంగ్రెసుమంత్రు లుత్తరువు లిచ్చియున్నను నిరంకుశ పూర్వాచార పరాయణులు ఈ బ్రిటీషు డవాలీలను తీసివేయనీయ లేదు. నేటికిని ప్రభుత్వ కార్యాలయములందు బుట్టతలపాగలు. కనబడుచునేయున్నవి. పై యధికారులు ప్రాతదుస్తులనే తాము