పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/509

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

19


మద్యపాననిషేధమును ప్రారంభించుట; నిమ్నజాతుల విద్యాభివృద్ధికొరకు 50 వేల రూపాయిలు ఖర్చుపెట్టుట; విద్యార్థుల దేహదార్డ్యమును వృద్ధిచేయుటకు సైనికశిక్షణము నిచ్చుటకు 50 వేలు వెచ్చించుట; దేశవాళీబెల్లము పరిశ్రమల అభివృద్ధికి క్రిందటిసాలున చేసినఖర్చు 37 వేలను ఈసాలున ఒక లక్ష రూపాయిలకు హెచ్చించుట; చేతిమగ్గముల పరిశ్రమను సంరక్షించుటకు క్రిందటిసాలున చేసిసఖర్చు ఒక లక్ష ముప్పదినాలుగువేలనుండి ఈసాలున ఒకలక్ష అరువదినాలుగువేలకు హెచ్చించుట; ఖాదీపరిశ్రమకు 10 వేలకు బదులు 20 వేలు ఖర్చుపెట్టుట; నూతన పారిశ్రామిక వృత్తివిద్యలందు ఇతరకళలందు విద్యార్దులను తయారు చేయుటకొరకు ఒక లక్ష రూపాయిలను విరాళముల (గ్రాంటులు) క్రింద ఖర్చుచేయుట; నేరములుజేయు జాతులుగా నిర్ణయింపబడిన అనాగరికుల నుద్దరించుటకొరకు అదనముగా 25 వేల రూపాయిలు ఖర్చుచేయుట; పోలీసుశాఖకు వెచ్చించు సొమ్ములో నింకొక లక్ష రూపాయిలు తగ్గించుట; రాష్ట్రములో ఖనిజసంపదను శోధించుటకొరకు 6 వేలు; అయిదారుగురు వైమానికులను తయారుచేయుటకు 5 వేలు; కార్మిక శ్రేయముకొరకు క్రిందటిసాలున ఇచ్చిన పదివేలను ఈ సాలున 25 వేలకు హెచ్చించుటయు ఈసాలు ఆదాయ వ్యయపట్టికలోని ప్రధానవిశేషములు.

మద్రాసు రాజధానిలో: క్రిందటి సాలువలెనే ఈ సాలున గూడా 75 లక్షల భూమిసిస్తుల తగ్గింపు; గ్రామములకుమంచి నీటి సదుపాయములను గలుగజేయు ప్రణాళికను నెరవేర్చుటకు