Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/510

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

భారతదేశమున


నిశ్చయించి ముందుగా నీయేడు 15 లక్షల రూపాయలు ఖర్చు చేయదలచుట; ఈ సాలున చిన్నరైతులకు వారి ఋణములను పరిష్కరించుకొన గలందులకు వారికి సహాయము చేయుకొరకు 50 లక్షల రూపాయలను ప్రత్యేకించి యుంచుట; పశువుల మేపుకొనుటకు విధింపబడు పుల్లరి రుసుములలో నూటి కేబది వంతుల తగ్గింపు; క్రిందటి సాలున సేలములో ప్రారంభించిన మధ్యపాన నిషేధమును చిత్తూరు కడప జిల్లాలకు వ్యాపింపజేయుట; క్రిందటి సాలుకన్న ఈసాలున విద్యకొరకు 5 1/4 లక్షలుఎక్కువ ఖర్చుచేయ దలచుట; అట్లే వైద్యము కొరకు ప్రజారోగ్యము నీటి సరఫరాల కొరకు 20 లక్షలును, వ్యవసాయము పశుసంరక్షణకు సహకారపరపతికి 4 లక్షలు, పరిశ్రమల యభివృద్ధికి 4 1/4 లక్షలుఎక్కువగా ఖర్చుపెట్ట దలచుటయు ఈ సాలున నిర్ణయింపబడిన ఆదాయవ్యయ పద్దతిగా మద్రాసు ప్రధానామాత్యుడు 1938 మార్చి 1 వ తేదీన శాసనసభలో ప్రకటించినాడు.

కాంగ్రెసు ప్రభుత్వమునకు రాగానే భారతదేశ దాస్యమును. చిరస్థాయిగా చేయదలచిన ఈ బానిసరాజ్యాంగమును తిరస్కరించుచు భారతజాతీయప్రతినిధులమహాసభ (Constituent Assembly) వారిచే తయారుచేయబడు రాజ్యాంగ స్థాపనమును గోరుచు నొకతీర్మానము అన్ని శాసనసభలందును గావింపబడెను. బ్రిటిష్‌వారు భారతదేశకేంద్రమున ప్రవేశ పెట్టదలచిన ఫెడరలు రాజ్యూంగవిధానము భారత దేశప్రజలకు , అనిష్టకరమనియు అంగీకారముకాదనియు దానిని వెంటనే రద్దుపరచి కేంద్రప్రభుత్వమునకు తగు ఏర్పాటు గావింప