18
భారతదేశమున
ఇండస్ట్రియల్ క్రెడిటు కంపెనీకి | 1,25,000 | |
మార్కెటింగు కంపెనీకి | 25,000 | |
మలెరియా వ్యాధిని తొలగించుటకు | 80,000 | |
గ్రామములలో వైద్యసహాయమునకు | 1,50,000 | |
పారిశ్రామిక పనులకుగాను యువకులకు | 1,00,000 |
ప్రాతగవర్నమెంటువారు ఇదివరకే కల్లుపాటలను పాడించి యుండినందున, ప్రస్తుత గవర్నమెంటువారు ఏ విధమగు మార్పులను చేయజాల పోయిరి. వచ్చే సంవత్సరమునుండి మద్యపాన నిషేధము అమలునం దుంచబడునని ప్రధానామాత్యుడు చెప్పెను. గవర్నమెంటు ఉద్యోగస్థులలోనున్న అవినీతిని తొలగించుటకుగాను ఒక స్పెషలు ఆఫీసరును నియమింతురు. ఇందుకుగాను రు 10000 లు ప్రత్యేకింపబడెను.
గ్రామాభివృద్ధికై పాటుపడినవారిని గౌరవమేజిస్ట్రేట్లుగాను జుడిషియల్ ఆఫీసర్లుగాను నియమించుటకు అవకాశము కలదు. వీరిని గవర్నమెంటు సర్వీసులలోనికికూడ తీసుకొందురు.
ఈ సాలుకు (1938-39) తయారుచేయబడిన కాంగ్రెనుమంత్రుల బడ్జెటులు చక్కగానే యున్నవి.
సంయుక్తరాష్ట్రములందు: ప్రజాశ్రేయముకొరకు ఒకకోటి పదిలక్షలరూపాయిలు ఖర్చుపెట్టుట; ఇందులో 97 లక్షలు కేవలము గ్రామస్థుల క్షేమలాభములకొరకే వినియోగించుట; వేసవికాలములో ప్రభుత్వకార్యాలయములు చల్లని కొండలపైకి పోవు దురాచారమును మానుట; మణిపురి, ఏటా జిల్లాలలో