పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/501

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

11


గుట ప్రారంభించినాడు. పంతులుగారికింకను బుద్దిరాలేదుగాని ఇతనికిమాత్రము బుద్దివచ్చినది. మంగళసూత్రమును జరిమానాక్రిందజప్తుచేసిన ఆంగ్లేయ సబుకలెక్టరుచేసినపని పైన చెప్పబడిన భారతీయులు చేసినదానికన్న అన్యాయమైనదికాదు. ఏలనన అతడు తక్కినవారివలె బానిసనౌఖరీలో, మెహర్బానీకొర కట్లుచేసిన వాడుగాడు. అదితప్పని తెలియగానే పశ్చాత్తాపము దెల్పినాడు. ఈ నల్లదొరలకుమాత్ర మేకోశమునను బశ్చాత్తాపములేదు.

కాలమహిమవలన ఏ కాంగ్రెసువారి నీ యుద్యోగులెల్లరు బాధించి అవమానించియుండిరో ఆ కాంగ్రెసు చేతిక్రిందనే నేడు పనిచేయవలసినగతి వీరికిపట్టినది. ఈ మహానుభావులు నాడు తాముచేసిన ఘోరాన్యాయములనెల్ల మఱపించుటకో యన నేడు ఇతరులందరికన్నను కాంగ్రెసును మంత్రులకు ఎక్కుడుగా స్వాగతము లిచ్చి విందుల కాహ్వానించుటయు కాంగ్రెసువారిని పొగడుటయుజరుగుచున్నది. "మేమేమిచేతుము? రావణునకైన స్వస్తిజెప్పవలె రామునకైన స్వస్తిజెప్పవలె"ననివీరనుచుందురు. గాని నిజముగా వీరు ఆనాడుచేసిన అత్యాచారములెల్ల ఆనాటి ప్రభుత్వము వారుచెప్పినందువల్లనే చేసిరా? కేవలము మెహర్బానీకొరకు ఒకరికన్న ఇంకొకరు గొప్పవార మనిపించుకొందమని, విరిగిన కాంగ్రెసు ఎమ్ముకలపైన, చిందిన కాంగ్రెసు రక్తముపైన, తమ స్వార్థ సౌధములను నిర్మించుకొందమనికదా వీరా క్రూరకృత్యములెల్లచేసిరి ! ఇది కేవలము సామాన్య సేవకవృత్తిలోని హైన్యస్వభావ ఫలితమేకాదు. ఏండ్లతరుబడి