పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

భారతదేశమున


పారతంత్ర్యమున బడియుండిన బానిసల యజమానుల తొత్తుల క్రిందితొత్తులై కూలీమేస్త్రులుగానుండు నౌఖరీపద్ధతి ఫలితమే యిది. వీరి ననవలసిన పనిలేదు. నేడు వీరుచేయు మెహర్భానీపనులు కట్టిపెట్టి తమ ప్రాతనిరంకుశ పద్దతులనెల్ల మాని, వీరు కాంగ్రెసు చెప్పినట్లు ప్రజాసేవచేసి పూర్వము చేసిన పాపములకు పరిహారము గావించుకొని ధన్యులగుదురు గాక!

ఉద్యోగములందు మాత్రమే గాక, బ్రిటిషు రాజ్యతంత్రము నిర్మించియుంచిన ఏ సంస్థయందు ప్రవేశించినను గూడ క్రమక్రమముగా ధనవ్యామోహముననో అధికారవ్యామోహముననో ఇంకొక వ్యామోహముననోబడి మత్తుమందు జల్లి వశపరుపబడిన వారివలె భారతీయులు స్వదేశమును స్వధర్మమును గూడ మరచి ప్రవర్తించుట జరుగుచున్నది. ఇదిచూచి యే మన కాంగ్రెసు, ఈ శాసనసభలను కోర్టులను పాఠశాలలను, ఉద్యోగములను గూడ బహిష్కరించవలెనని నిర్ణయించినది. బిరుదులనుత్యజించవలెననియు ప్రభుత్వోద్యోగులను గౌరవించుట కేర్పడిన సమ్మానములందు కాంగ్రెసు పాల్గొన కూడదనియు ఇంకనుఎన్నోకట్టుబాటులుచేసికొనినది. కాంగ్రెసు తనయొక్క పరిశుద్దజాతీయతనుసంరక్షించుకొని దేశభక్తి పూరితమై దేశముకొరకు ప్రజలకొరకు ఎన్నికష్టములకైన నోర్చి దేశదారిద్ర్యమును మాన్పుటకు సంపూర్ణ స్వాతంత్ర్యమును సంపాదించుటకు శాంతిసమరమున పాల్గొని సర్వస్వమును త్యజించి ఆహుతికాగల త్యాగధైర్య శాంతిసత్య సాహసౌదార్య