10
భారతదేశమున
గోడపై వ్రేలాడుచుండిన జార్జిరాజు బొమ్మచూపి “ మొన్న రాజభక్తి సభ జరిపితివే, జార్జిచక్రవర్తి, నీ యమ్మ మొగుడా?" అని కలెక్టరుగారిని అడిగెను. ఈ డిప్టీకలెక్టరు చాలా లాటీచార్జీలు చేయించి భీమవరంలో బ్రిటిష్‌సామ్రాజ్యము కాపాడినందు కితనికి తరువాత పెద్ద యుద్యోగములోనికి ప్రమోషను ఒసగబడినది.
బెజవాడ సబుకలెక్టరునెదుట ఒక గొప్ప కుటుంబములోని కమ్మయువకుని కాంగ్రెస్ ఉద్యమమున పట్టితెచ్చిరి. ఆ భారతీయోద్యోగి ఈయువకుని నీవృత్తియేమని యడిగెను. ఇతడు దేశసేవయనెను. అంతట నాకలెక్టరు రికార్డులో "దేశ దిప్పకాయ" (వేగబాండు) అని నమోదుచేసెను! ఈ దేశ ద్రిమ్మరి యిప్పు డొక శాసనసభ్యుడుగా ఎన్నుకొనబడినాడు. ఐ. సి. ఎస్. లోని భారతీయుడు ఒంగోలు సబు కలెక్టరుగానుండగా సత్యాగ్రహోద్యమ సందర్భమున దేశభక్త కొండావెంకటప్పయ్యపంతులుగారిని విచారించి శిక్షించుచు “నీ కిన్ని యేండ్లు వచ్చినను బ్రిటిష్‌ప్రభుత్వమునకు వ్యతిరేకముగా పనిచేసినందుకు నీవు ఇదివర కొకమారు శిక్షింపబడియున్నను నీకు బుద్దిరాలేదు" అని అందరు వినుచుండగా ననెను! ఈ గొప్ప యుద్యోగి నేడు పెద్దకలెక్టరుగానున్నాడు. కాని ఇతని బానిస గుణము కాంగ్రెసు ప్రభుత్వమునకు రాగానే ఇంకను ప్రకటింపబడినది. నేడితడు కాంగ్రెసుమంత్రులను, కార్యదర్శులను ఆశ్రయించుట, వారికి స్వాగతమునిచ్చుట, విందు లొస