బ్రిటీష్‌రాజ్యతంత్రము
5
మెల్ల కేవలము బ్రిటీషు ప్రభుత్వమువారి దయాధర్మముల పై నను అధికారప్రాబల్యముల పై నను ఆధారపడియుండి నందున దేశములో స్వార్థపరుల సంఖ్య హెచ్చసాగెను. శాసనసభలలో దేశక్షేమముకొరకు జాతీయశ్రేయముకొరకు రాజకీయస్వాతంత్ర్యముకొరకు పాటుపడు నిష్కల్మష హృదయులును జాతీయ రాజకీయ పక్షములును వర్ధిల్లుటకు వీలులేకుండునట్లు చేయబడెను. కేవలము కులకక్షలనే ప్రధానముగాగల జస్టిసుపార్టీ నిర్మాణమునకు పభుత్వమువారు చేసిన దోహదము జగత్ప్రసిద్ధము. ఇట్టి కులతత్వపక్షములు ఇతర రాష్ట్రములందు గూడ ఏర్పడుటకు అవకాశములు కల్పింపబడెను. ఇట్టివా రెల్లరు ప్రభుత్వమువారి రాజ్యతంత్రమునకు వశులై వారి నిరంకుశ పరిపాలన కే సహాయపడసాగిరి. ఇట్లు దేశముయొక్క రాజకీయశక్తులన్నియు ప్రభుత్వము చేతిలోని కీలుబొమ్మలైనవి. అందువల్లనే ఈ కశ్మలమునందు పడుటకు కాంగ్రెసు అంగీకరింపలేదు
ప్రభుత్వయంత్రము:— బ్రిటీషుప్రభుత్వము కేవలము అమానుషమును నిర్జీవమును అగు ఒక యంత్రమే యని భారత జాతీయనాయకులును, చరిత్రకారులును, రాజనీతిజ్ఞులగు విదేశీయులును గూడ అంగీకరించియున్నారు. ఈ ప్రభుత్వ మొక ఇనుప చట్రము. దీనిలోని ఐ.సి.ఎస్. ఉద్యోగులు దేశ ప్రజలయొక్క సేవకులుగాగాక కేవలము విదేశ “సర్కారు" యొక్క నౌకరులుగా మాత్రమే ప్రవర్తించుచు వారి యాజ్ఞానువర్తు లై ప్రజలకు వ్యతిరేకముగకూడ వర్తించుచుందురు.