Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/496

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

భారతదేశమున


ప్రభుత్వనివేదికలు మాత్రము చక్కగా సాలియానా ప్రకటింపబడుచుండును. విద్యాభివృద్ధి, వైద్యసహాయము, దేశముయొక్క ఆర్ధికాభివృద్ధి చక్కగ జరుగుచున్నటులే ఆనివేదికలయందు చూపబడును. పై యధికారికి దాసానుదాసుడై వర్తించుచు ఎల్లప్పుడును వానిని మెప్పింపజూచుటయు, క్రింది ఉద్యోగిపైన స్వారిచేసి హింసించి నీచముగ జూచి తృణీకరించుటయు నీ ప్రభుత్వములో ఉద్యోగలక్షణములుగా నున్నవి. ఈఉద్యోగులకు ప్రజల కష్టసుఖములు తెలియవు. వానిని గూర్చి ఆలోచింపనైన ఆలోచింపరు. జమాబందీలయందును పర్యటనములందును మహావిభవముతో పరివారముతో పోయి గ్రామస్థులను పీడించి సప్లయిలు పొందుదురు. కొందరు ధర్మాత్ములున్నను చాలమంది యుద్యోగులకిది యలవాటు. ప్రజలతోకలసిమెలసి వారి కష్టసుఖములు తెలిసికొనవలసిన ఉద్యోగశాఖలగు డి. పి. డబ్లియు., వ్యవసాయ, పారిశ్రామిక, సహకారశాఖలందు గూడ ఈ పద్దతులే అమలు జరుగుచున్నవి. ప్రజలతో నీ గొప్పయుద్యోగులు తెనుగున మాటలాడుట గూడ లేదు! భారతీయులుగూడ ఇంగ్లీషు మాటాడవలసినదే!! దొరలనిపించు కోవలసినదే. అధికారములను చలాయించుటయే గాని ఆలన పాలనలు లేవు. వీరు గ్రామములకు చేయు మేలు లేదు. అధికారులు వచ్చునప్పుడెల్ల గ్రామస్థులు చాల కష్టపడుదురు. వీరు వచ్చినందుకు సంతోషపడువారు లేరు. ప్రతిపెద్ద యుద్యోగియు ఇంకొకచోటికి బదలాయింపు చేయబడినప్పుడు అల్పాహారవిందులు పూలదండలు ఫొటోగ్రాపులుతో బహూకరింప