4
భారతదేశమున
నకు విరుద్ధముగా బ్రిటీషు వర్తకులకు లాభకరముగ నుండు పెక్కుచట్టములు, తీర్మానములు, గావించుచుండుటయు సుంకములు పన్నులు విధించుటయు కాంగ్రెసు నాయకులు చూచీ ఈ పద్మవ్యూహమున ప్రవేశించుట కిష్టపడలేదు.
బ్రిటీషు ప్రభుత్వమువారు శాసనసభల నిర్మాణములో గూడ తమ పక్షీయులే ఎన్నుకొనబడునట్లును, తమకు వ్యతిరేకులగు జాతీయవాదులు ప్రవేశింప లేకుండునట్లు చేయుటకును జాతి, మత, కుల వివక్షతలను, భేదములను శాశత్వముగా నెలకొల్పి ఆయాపక్షీయులు ఒండొరులతో పోరాడుకొని బ్రిటీషుప్రభుత్వమునే ఆశ్రయించియుండునట్లు చేయగల ప్రత్యేక నియోజకవర్గముల నేర్పాటుచేసి శాసనసభలు మొదలు గ్రామపంచాయితులువరకు నన్నిసంస్థలును, ఈకులతత్వ వాదులతోను మతాభిమానులతోను స్వార్థపరులతోను నింపి, ఈ కీలుబొమ్మలయొక్క సహాయముతో నిరంకుశముగా పరిపాలింపసాగిరి. స్థానికస్వపరిపాలనా సంస్థలందు రాజకీయ పద్ధతులపైనగాక కులతత్వ పద్దతులపైననే వివిధపక్షము లేర్పడుటవలన కక్షలు కలహములు వర్ధిల్లినవి. కార్యాలోచనను పరిపాలనా నిర్వహణమును విడదీయకపోవుటవలన అనర్థములు వృద్ధియైనవి. మునిసిపాలిటీలు, జిల్లాబోర్డులు, పంచాయితీలు స్వార్థపరుల చేతులలోపడి కంట్రాక్టులందు ఇతర పనులందు లంచగొండెతన మభివృద్ధియైనది. ఈ సంస్థలందు జేరినవా రెల్లరు ధనబలము, అధికారబలము నుపయోగించుకొని ప్రభుత్వప్రాపకముతో శాశ్వతముగా ప్రజాపీడన చేయుచుండిరి. ఇట్లు దేశ పరిపాలన