పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

3


హేశ్వరశర్మగారు కాంగ్రెసును విడనాడి కార్యనిర్వాహక సభ్యుడై కాంగ్రెసుకు విరోధియగుటయు, ఇంకనూ ఆశ్చర్యకరముగా నీ మహానుభావుడే మరియొకమారు. ప్రభుత్వము చేసిన ఘోరాన్యాయములకు అసమ్మతిగా తన పదవికి రాజీనామానిచ్చి మరల ప్రభుత్వము వా రీతనిని బుజ్జగించి లోబరచుకొనగా తన రాజీనామా నుపసంహరించుకొనుటయు, శాసనసభ్యుడుగా నుండినప్పుడు తీవ్రజాతీయవాదిగా ప్రవర్తించుచు ప్రభుత్వమునకు వ్యతిరేకముగా కాంగ్రెసుకు సహాయుడుగా నుండిన షణ్ముఖం చెట్టిగారు, ప్రభుత్వపు రాజ్యతంత్రమునబడి సర్ బిరుదమునొంది భారతదేశ పారతంత్ర్యమునకు “ఒటావా” ఆర్థికదాస్యమునకు కారకుడగుటయు ప్రత్యక్షముగా జూచిరి. ఎందరో మహానుభావు లిట్లు ప్రభుత్వమువారికి దాసాను దాసులై ప్రవర్తించుచుండుటయు తుదకు ప్రజలపక్షమున ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొనబడిన శాసనసభ్యులలో గూడ కొందరు ప్రభుత్వమువారి బిరుదులకు ప్రాపకమునకు ప్రాకులాడి వారివలన మెప్పుపొందుటకు బ్రిటీషు సామ్రాజ్యతత్వమునకు అనుకూలముగను భారతదేశ ప్రజల క్షేమమునకు వ్యతిరేకముగను అనేకవిషయములందు వోటుచేయుచుండుటయు, (బ్రిటీషు) రాజప్రతినిధియు ఆయన భార్యయు వారి తాబేదారులును జరుపు విందులకుపోయి మర్యాదలందుటయు ఆ మోమోటమిచే గూడ ప్రభుత్వము పక్షమున వోటుచేయుటయు, ఇట్లు సామదానభేదదండోపాయములచేత శాసనసభలను కూడ ప్రభుత్వము వశపరచుకొని భారతదేశ ఆర్థికక్షేమము