440
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
1929 ఇంగ్లాండులో లేబరు పార్టీ ప్రభుత్వము - వెడ్జివుడ్‌బె౯ ఇండియా రాజ్యాంగ కార్యదర్శియగుట. అక్టోబరు 31వ తేదీన ఇర్వి౯ ప్రభువు భారతదేశ రాజ్యాంగ పరిణామము అధినివేశ స్వరాజ్యమేయని ప్రకటించుట. లాహోరు కాంగ్రెస్ వూర్ణ స్వాతంత్ర్య తీర్మానము.
1930 గాంధిమహాత్ముని ఉప్పు సత్యాగ్రహము; ఆర్డినెన్సుల పరిపాలనము. సైమను కమిషను రిపోర్టు. బర్మాపితూరీ. రౌండుటేబిలు కాన్ఫరెన్సు.
1931 మోతీలాల్ నెహ్రూ మరణము (ఫిబ్రెవరి 6). గాంధీ ఇర్వి౯ ఒడంబడిక (మార్చి 5). విల్లింగ్డ౯ వైస్రాయియగుట. రెండవ రౌండుటేబిలుసభసమావేశము. ఇంగ్లాండులో లేబరు ప్రభుత్వముపోయి కన్సర్వేటివుల ప్రభుత్వము వచ్చుట. ఇంగ్లాండులో ఆర్థికక్షోభ కలుగుట.
1932 కాంగ్రెసు అణచివేయబడుట. మహాత్మాగాంధి చెరకంపబడుట. ఆర్డినెన్సుల పరిపాలన. మూడవ రౌండుటేబిలుసభ సమావేశము. గాంధిమహాత్ముని ప్రాయోపవేశము. పూనా ఒడంబడిక (సెప్టెంబరు 26). క్రిమినలు లా సవరణ (ఆర్డినెన్సుల) చట్టము.
1933 వైట్ పేపర్ ప్రకటన. జాయింటు పార్లమెంటరీ కమిటీ విచారణ. జర్మనీలో నాజీపక్ష నాయకుడగు హిట్లరు సర్వాధికారియగుట. అనిబీసెంటు నిర్యాణము (సెప్టెంబరు 30)
1934 బీహారు భూకంపము (జనవరు 15), రిజర్వు బ్యాంకు చట్టము.
1935 క్వెట్టా భూకంపము (మే). ఇంగ్లాండు ఇండియాల వ్యాపార ఒడంబడిక . నూతన ఇండియా రాజ్యాంగచట్టము (డిశంబరు).
1936 ఐదవచార్జి తదనంతరము ఎనిమిదవ ఎడ్వర్డు రాజగుట (జనేవరి 20) ఒరిస్సా సింధు రాష్ట్రముల ప్రారంభము. లి౯లిత్‌గో ప్రభువు వైస్రాయియగుట (ఏప్రెలు 18). ఎనిమిదవ ఎడ్వర్డు రాజ్యపరిత్యాగము (డిశంబరు 10). ఇటలీ అబిసీనియాను ఆక్రమించుట - హిట్లరు ఆస్ట్రియాను జేజిక్కించుకొనుట. స్పెయినులో యుద్దము.
1937 రాష్ట్రీయ శాసనసభలకు ఎన్నికలు (ఫిబ్రెవరి). ఇంటరిం మంత్రులు.. కాంగ్రెసు మంత్రిత్వములు స్వీకరించుట (జూలై). ఫెడరల్ కోర్టు ప్రారంభము (డిశంబరు). చీనా జుపానుయుద్ధము (జూలై).
1938 బీహారు సంయుక్త రాష్ట్రముల మంత్రుల రాజీనామా. (ఫిబ్రేవరు 15.) 'రాజ్యాంగమర్యాద' ఏర్పడుట. హరిపుర కాంగ్రెసు (ఫిబ్రేవరు 19)