సంవత్సరములవారీ చరిత్ర
439
1918 మాంటేగూ షెమ్సుఫోర్టు రిపోర్టు, రౌలటుకమిటీరిపోర్టు (రాజద్రోహ విచారణ). ఐరోపా యుద్ధవిరామసంధి. (నవంబరు 11)
1919 రౌలటుబిల్లులు శాసనమగుట. హబిబుల్లా హత్యచేయబడుట. పంజాబులో జాలియన్ వాలా బాగువధలు (ఏప్రిలు 12) మార్షల్ లా, మూడవ ఆఫ్‌గను యుద్ధము (మే). మహసుదులపై దాడి. మాంటేగూ రాజ్యాంగ సంస్కరణ చట్టమును గూర్చి ఆంగ్లచక్రవర్తి ప్రకటన. (డిశంబరు). వీరేశలింగంపంతులుగారి నిర్యాణము.
1920 హంటరుకమిషను రిపోర్టు. క్రొత్త శాసనసభలకు ఎన్నికలు, ఎషర్ కమిటీ (మిలిటరీ సంస్కరణలు) రిపోర్టు. శ్రీలోకమాన్యతిలకు నిర్యాణము. (జూలై 31). గాంధీగారి సహాయ నిరాకరణ ప్రారంభము.
1921 కన్నాటు ప్రభువు క్రొత్తశాసనసభలు ప్రారంభించుట. రీడింగు వైస్రాయియగుట. మాప్లా తిరుగుబాటు. ప్రిన్సు ఆఫ్ వేల్సు (ఎనిమిదవ ఎడ్వర్డు) ఇండియాకు వచ్చుట.
1922 చౌరీచౌరా ఘోరములు; బార్డోలీ నిర్ణయములు. గాంధిమహాత్మునికి రాజద్రోహమునకు 6 సం|| శిక్ష. రంపపితూరీ. గురుఖాబాగ్ సంఘటనలు. ఐరిషుఫ్రీస్టేటుస్థాపన. ఇటలీలో ముసోలిని నియంతృత్వము.
1923 ఉప్పు పన్ను సర్టిఫై చేయబడుట. తురుష్క ప్రజాస్వామిక స్థాపన.
1924 వంగరాష్ట్ర ఆర్డినెన్సు. స్వరాజ్య పార్టీ శాసనసభలందు ప్రవేశించుట. సోవియట్ రష్యా స్థాపకుడగు లెనిన్ నిర్యాణము (జనేవరు 21)
1925 మడ్డిమను రాజ్యాంగసంస్కరణల విచారణసంఘ నివేదిక. చిత్తరంజనదాసు నిర్యాణము. శ్రీ అల్లూరి సీతారామరాజుగారి వధ.
1926 వ్యవసాయమునుగూర్చిన రాయల్ కమీషను రిపోర్టు, కలకత్తాలో హిందూమహమ్మదీయుల కొట్లాట. ఇర్విన్ ప్రభువు వైస్రాయియగుట.
1927 రూపాయి విలువ స్థిరపరచుచట్టము. సైమనుకమిషను నియమింపబడుట. పబ్లికు సర్విసులనుగూర్చిన కమీషను.
1928 ఆఫ్‌గ౯ అమీరగు అమానుల్లా పదచ్యుతి. భారతదేశమున సర్వపక్ష మహాసభ. సైమన్ కమిషను బహిష్కరణము-లాటీచార్జి లజపతిరాయి నిర్యాణము. సోవియట్ రష్యా పంచవర్ష ప్రణాళిక ప్రారంభము.