22
భారత దేశమున
వలెనే భూములపై నవచ్చు రివిన్యూ (ఆదాయము) కూడా వృద్దిచేయవలయు ననియే మా యభిప్రాయము. వర్తకములో వేయి విపత్తులు కలిగినను మనలను రక్షింపగలట్టి దీ రివిన్యూ ఆదాయమే. దానివలననే ఇండియాలో మనమొక బలవంతమగు జాతిగా నిలువగలుగుదుము. లేనియెడల మనము దేశములో వర్తకము జేసికొనుటకు పట్టానొందివచ్చిన పరాయివారిగనే యుందుము. అట్టి స్థితిలో నితరుల కెవ్వరికిని పనికిరానిచోట్ల మాత్రమే మనము వర్తకము చేసికొనవలసి వచ్చును."
భారతదేశమును ఇంగ్లీషువారు తమ భుజబలముచేత నెన్నడును జయింపలేదు. ఈ దేశరాజులను నవాబులను నొకరిపై నొకరిని పురికొల్పి అందరిని నాశనముజేసియే వారు రాజ్యాక్రమణము జేసిరి. "మొట్టమొదట ఆర్కాటు నవాబును అణచుటకు కంపెనీవారికి నైజాము సహాయము జేసెను. తరువాత నైజూము నణచుటకు ఆర్కాటు నవాబు సాయపడెను. ఇట్లే మహమ్మదీయుల నణచుటకు మహారాష్ట్రులును, మహారాష్ట్రుల నణచుటకు మహమ్మదీయులును కంపెనీవారికి తోడ్పడిరి. తిరిగి ఈ పద్ధతి తప్పకుండా హిందువుల నణచుటకు ఆఫ్‌గనులును ఆఫ్గనుల నడచుటకు హిందువులును కంపెనీవారికి తోడ్పడిరి. ఈ దేశము నింగ్లీషువారికి చేజిక్కించుటకు మన దేశరాజులయొక్కయు నవాబులయొక్కయు భుజబలమే.- అంతఃకలహలము లే కారణములయ్యెను. ఇంకొక విశేష మేమనగా నీ మహాసామ్రాజ్యమును స్థాపించుటలో నింగ్లీషువారి కొక్క