పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

21


రెండవ ప్రకరణము

బ్రిటిష్ ఇండియా నిర్మాణము.

I

బ్రిటిష్ వారీ దేశము నాక్రమించిన విధము.

ఆంగ్లేయులు భారతదేశమునకు వర్తకము చేయుటకొరకు 1600 సం||లో పట్టాపొందివచ్చి మెల్లగా దేశాక్రమణముజేసి అచిరకాలముననే బ్రిటిష్ సామ్రాజ్యమును స్థాపించిన విచిత్ర పరిణామమునకు ప్రపంచచరిత్రలో నింకొక యుదాహరణము గానరాదు. బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనము అప్రయత్నముగా, తలవని తలంపుగా జరిగినదని పొఫెసర్ సీలీపండితుడు చెప్పుమాటలు సరికావు. భారతదేశమున తను ఆధిపత్యమును సుస్థిరముగా నెలకొల్పవలెనను నుద్దేశము ఆంగ్లేయ వర్తక కంపెనీవారి డైరెక్టరులకు 1687 లోనే కలిగినదని సర్ విలియం హంటరుగారు తమ బ్రిటిష్ ఇండియాచరిత్ర రెండవకూర్పు పీఠికలో వ్రాసియున్నారు. అయితే వారు తలపెట్టినది రాజకీయాధిపత్యముగాక వాణిజ్యాధిపత్యమే యని అతని తలంపు. భారతదేశమున ఆంగ్లేయులు జరిగించిన చర్యల వలన వాణిజ్యాధిపత్యము రాజకీయాధిపత్యమునకు దారితీసినదని స్పష్టమగుచున్నది. భారతదేశమున వర్తకలాభములతోపాటు రాజ్య సంపాదనకూడ కంపెనీవా రభిలషించిరనుటకు లిఖితా ధారములు కలవు.

1689 లో నింగ్లాండునుండి కంపెనీ డైరెక్టరులు భారతదేశములోని కంపెనీయధికారుల కిట్లువ్రాసిరి. "వ ర్తకలాభము